NECK MAKEUP: శంఖం లాంటి మెడతో మెరిసిపోవాలంటే..!

ABN , First Publish Date - 2023-06-01T11:14:35+05:30 IST

మేకప్‌ ముఖానికే కాదు, మెడకూ వేయాలి. లేదంటే ముఖానికీ, మెడకూ పొంతన కుదరక ఎబ్బెట్టుగా కనిపిస్తాం. అందమైన ముఖారవిందంతో పాటు శంఖం లాంటి మెడతో

NECK MAKEUP: శంఖం లాంటి మెడతో మెరిసిపోవాలంటే..!
NECK MAKEUP

మేకప్‌ ముఖానికే కాదు, మెడకూ వేయాలి. లేదంటే ముఖానికీ, మెడకూ పొంతన కుదరక ఎబ్బెట్టుగా కనిపిస్తాం. అందమైన ముఖారవిందంతో పాటు శంఖం లాంటి మెడతో మెరిసిపోవాలంటే ఇవిగో ఈ టిప్స్‌ పాటించాలి.

పైబడే వయసు మెడలో ప్రతిబింబిస్తుంది. అక్కడి చర్మం సాగుతూ, ముడతలుపడుతూ ఉంటుంది. కాబట్టి మేకప్‌ విషయంలో ముఖం పట్ల ఎంతటి శ్రద్ధను కనబరుస్తామో, మెడ పట్ల కూడా అంతే శ్రద్ధను కనబరచాలి.

సిలికాన్‌ ప్రైమర్‌: మెడ మీద ఏర్పడే సన్నని లైన్లు, ముడతలు కనిపించకుండా చేయడం కోసం, మేకప్‌కు ముందు సిలికాన్‌ ప్రైమర్‌ అప్లై చేయాలి. దీంతో చర్మం నునుపుగా మారి గీతలు మటుమాయమవుతాయి. టింటెడ్‌ ప్రైమర్‌తో ఓపెన్‌ పోర్స్‌ను కూడా దాచేయవచ్చు. ఇందుకోసం మెడలోని డార్కర్‌ ఏరియాల్లో ప్రైమర్‌ అప్లై చేసి, తడి స్పాంజ్‌తో బ్లెండ్‌ చేయాలి. మెడ మీద డార్కర్‌ ఏరియాలను కరెక్ట్‌ చేయడం కోసం కన్‌సీలర్‌ కంటే ముందు కలర్‌ కరెక్టర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

మాయిశ్చరైజర్‌: మెడ మీద చర్మం పలుచగా ఉంటుంది కాబట్టి తేలికగా పొడిబారిపోతూ ఉంటుంది. కాబట్టి ముఖంతో పాటు తప్పనిసరిగా మెడకూ మాయిశ్చరైజర్‌ అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే మెడ మీద గీతలు, మచ్చలు, ముడతలు ఏర్పడకుండా ఉంటాయి.

ఫౌండేషన్‌: లిక్విడ్‌ లేదా క్రీమ్‌ ఎలాంటి ఫౌండేషన్‌ను ఎంచుకున్నా, ముఖం, మెడ మీద సమానంగా పరుచుకునేలా తడిపిన స్పాంజీతో అప్లై చేసుకోవాలి. అలాగే, అవసరానికి మించి ఫౌండేషన్‌ ఉపయోగిస్తే, మెడ మీది ముడతల్లో ఇరుక్కుపోయి, ముడతలు స్పష్టంగా కనిపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగుమాత్రంగానే ఉపయోగించాలి.

బ్లష్‌: చెక్కిళ్ల మీద అప్లై చేసుకునే బ్లష్‌ను కొద్ది పరిమాణంలో మెడ మీద అప్లై చేసుకోవడం వల్ల, ముఖం, మెడా రెండూ ఈవెన్‌ కలర్‌లో కనిపించే అవకాశం ఉంటుంది.

విటమిన్‌ సి సీరమ్‌: విటమిన్‌ సితో కూడిన సీరమ్‌ లేదా మాయిశ్చరైజర్‌ ఉపయోగించడం వల్ల యువి ఎక్స్‌పోజర్‌తో కలిగే ఫ్రీ ర్యాడికల్‌ డ్యామేజీ నుంచి మెడ చర్మానికి రక్షణ దక్కుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి.

హైలైటర్‌: మెడ మీద ఇతరుల చూపును పక్కకు తప్పించి, చెక్కిళ్ల మీద నిలపడం కోసం, చెక్కిళ్ల మీద హైలైటర్‌ అప్లై చేయాలి. అయితే ఇందుకోసం లిక్విడ్‌ హైలైటర్‌ను ఉపయోగించాలి.

Updated Date - 2023-06-01T11:14:35+05:30 IST