Tips: మోచేతులు, మోకాళ్ల నలుపు వదలడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటిస్తే..!

ABN , First Publish Date - 2023-04-01T11:53:46+05:30 IST

మోచేతులు, మోకాళ్ల నలుపు వదలడం కోసం కొన్ని చిట్కాలు పాటించవచ్చు. అవేంటంటే

Tips: మోచేతులు, మోకాళ్ల నలుపు వదలడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటిస్తే..!
Tips

మోచేతులు, మోకాళ్ల నలుపు వదలడం కోసం కొన్ని చిట్కాలు పాటించవచ్చు. అవేంటంటే

అలోవెరా జెల్‌: అలోవెరా గుజ్జును పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి క్రమం తప్పక చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మోచేతులు, మోకాళ్లు తెల్లగా మారతాయి.

పసుపు, తేనె, పాలు: పాలు బ్లీచ్‌లా పనిచేస్తే, తేనె చర్మానికి తేమను అందిస్తుంది. పసుపు క్రిమిసంహారకం. కాబట్టి ఈ మూడింటినీ కలిపి ప్యాక్‌ వేయాలి. పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే మోచేతులు, మోకాళ్ల దగ్గరి చర్మం తేటగా తయారవుతుంది.

ఆలివ్‌ ఆయిల్‌, పంచదార: నలుపు వదలాలంటే స్క్రబ్‌ చేయాలి. ఇందుకోసం ఆలివ్‌ ఆయిల్‌లో పంచదార కలిపి మోచేతులు, మోకాళ్లమీద సున్నితంగా స్క్రబ్‌ చేయాలి. తర్వాత సబ్బునీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉండాలి.

నిమ్మరసం: నిమ్మరసం చర్మాన్ని తెల్లబరుస్తుంది. మోకాళ్లు, మోచేతుల మీద నిమ్మరసం అప్లై చేసి గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా నలుపు వదిలేవరకూ ప్రతిరోజూ చేయాలి.

హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌: సూర్యరశ్మి వల్ల నల్లబడిన చర్మాన్ని హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ తెల్లబరుస్తుంది. దీన్లో దూదిని ముంచి మోకాళ్లు, మోచేతుల మీద 15 నిమిషాలపాటు రుద్దాలి. రుద్దతున్నప్పుడే నలుపు తగ్గటం మీరు గమనిస్తారు.

సన్‌స్ర్కీన్‌ లోషన్‌: ముఖంతోపాటు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ను మోచేతులు, మోకాళ్ల మీద కూడా అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే సన్‌ టాన్‌ రాకుండా ఉంటుంది.

బాదం పప్పు: బాదంలో విటమిన్‌ ఇ ఉంటుంది. కాబట్టి బాదం పప్పును మెత్తగా నూరి దాంతో మోకాళ్లు , మోచేతులు రుద్దాలి. ఇలా చేస్తే మృత కణాలు తొలగి ఈ రెండు ప్రదేశాలు తెల్లబడతాయి.

Updated Date - 2023-04-01T11:53:46+05:30 IST