Health tips: ఈ నాలుగు ఉంటే... ఆరోగ్యం మీ వెంటే

ABN , First Publish Date - 2023-01-30T12:04:07+05:30 IST

ఆరోగ్యం (Health)గా ఉంటే జీవితం చాలా సాఫీగా సాగిపోతున్నట్లే! జీవన విధానం, ఆహారపు అలవాట్ల ద్వారా అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నామంటారు ఆరోగ్య నిపుణులు (Health professionals). అనారోగ్యం మన దరికి

Health tips: ఈ నాలుగు ఉంటే... ఆరోగ్యం మీ వెంటే
ఈ నాలుగు ఉంటే...

ఆరోగ్యం (Health)గా ఉంటే జీవితం చాలా సాఫీగా సాగిపోతున్నట్లే! జీవన విధానం, ఆహారపు అలవాట్ల ద్వారా అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నామంటారు ఆరోగ్య నిపుణులు (Health professionals). అనారోగ్యం మన దరికి చేరకుండా ఉండటానికి నాలుగు చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు. అవేమిటో చూద్దాం..

ప్రొటీన్‌ తప్పనిసరి...

మన శరీరంలోని కణజాలాలు ఆరోగ్యంగా ఉండాలన్నా.. హార్మోన్లు విడుదల కావాలన్నా.. శరీరానికి అవసరమైన శక్తి లభించాలన్నా.. ప్రొటీన్‌ తప్పనిసరి. పెరిగే పిల్లలు.. క్రీడాకారులు.. వృద్ధులు.. ఈ ప్రొటీన్‌ (Protein)విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం తినే ఆహారంలో వీలైనంత ఎక్కువ ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలి. చికెన్‌ (Chicken), ఫిష్‌ (Fish), గుడ్లు (Eggs), తోఫు, పనీర్‌, ఓట్‌మీల్‌ మొదలైన వాటిలో ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరానికి తగిన ప్రొటీన్‌ అందుతుంది.

హోమ్‌ వర్కవుట్స్‌

చాలా మంది ఆరోగ్యంగా ఉండటమంటే కండలు పెంచటం అనుకుంటారు. కానీ ఉదయాన్నే లేచి నడవటం.. కొద్ది సేపు యోగా చేయటం.. వీలైతే కొంత సేపు ఈత కొట్టడం వల్ల వ్యాయామం (exercise)చేసినట్లు అవుతుంది. ఈ తరహా వ్యాయామం చేయటం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల ఇంట్లోనే ప్రతి రోజు ఎంతో కొంత సేపు వ్యాయామం చేయటం తప్పనిసరి.

నో ఆల్కాహాల్‌..

ఆల్కాహాల్‌ తాగటం వల్ల రకరకాలైన ఆరోగ్యసమస్యలు ఏర్పడతాయి. బీపీ (bp), గుండెజబ్బులు (heart disease), కాలేయం చెడిపోవటం వంటి సమస్యలతో పాటుగా క్యాన్సర్‌ (Cancer) కూడా వచ్చే అవకాశముంది. అందువల్ల వీలైనంత వరకూ ఆల్కాహాల్‌కు దూరంగా ఉండటం మంచిది.

ప్రతి అడుగు విలువైనదే...

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి అరగంటకు ఒకసారి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. ఇంట్లో, ఆఫీసులో, బయట పనుల మీద వెళ్లినప్పుడు- ఎక్కువసేపు కూర్చోకూడదు. దూరంగా పార్కింగ్‌ చేయటం.. ఒకటి రెండు అంతస్థులు ఎక్కడం వంటి చిన్న చిన్న చిట్కాల వల్ల ఎక్కువ అడుగులు వేసినట్లు అవుతుంది.

Updated Date - 2023-01-30T12:04:38+05:30 IST