Watermelon: పుచ్చకాయ పండింది అని ఎలా తెలుసుకోవాలి..ఇవిగో 5టిప్స్
ABN , First Publish Date - 2023-04-11T20:21:01+05:30 IST
మరి పుచ్చకాయ పండిందా? లేదా ఎలా తెలుసుకోవాలి..రుచికరంగా ఉండే పుచ్చకాయను సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి.
ఎండకాలంలో పుచ్చకాయ(Watermelon) తింటే ఎంత చలువ నిస్తుందో మనకు తెలుసు. అయితే పుచ్చకాయ కొనేటప్పుడు మనకు చాలా సందేహాలు కలుగుతుంటాయి. పుచ్చకాయ లోపల ఎర్రగా ఉందా పండిందా.. తీయగా ఉందా లేదా.. ఇలా అనేక సందేహాలు కలుగుతుంటాయి. మరి పుచ్చకాయ పండిందా? లేదా ఎలా తెలుసుకోవాలి..రుచికరంగా ఉండే పుచ్చకాయను సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి.
ఎండాకాలం ప్రారంభంతో పుచ్చకాయల సీజన్ వచ్చేసింది. ఈ సీజన్‌లో వీధుల్లో ఎక్కడిపడితే అక్కడ వ్యాపారులు తోపుడు బండ్లపై పుచ్చకాయల అమ్ముతుంటారు. మండే ఎండల్లో డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవాలంటే రసవంతమైన, తీయని రుచికరమైన పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే పుచ్చకాయల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది, యాంటీఆక్సిడెంట్లు(Antioxidants) పుష్కలంగా ఉంటాయి. సమ్మర్(Summer)లో తినే ఉత్తమమైన పండ్లలో పుచ్చకాయలు ఒకటి. పుచ్చకాయ మంటతో పోరాడడంతో పాటు కడుపుని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిని మామూలుగా లేదా పుదీనా(Mint), ఫెటా(Feta)తో కలిపి సలాడ్ల(Salads) రూపంలో గానీ, జ్యూస్ (Juice)చేసుకొని గానీ తాగితే ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచుతుంది.

కానీ తరచుగా గందరగోళానికి గురిచేసే విషయాలలో ఒకటి సరైనదాన్ని ఎలా ఎంచుకోవాలి. గతంలో పుచ్చకాయలు పరీక్షించుకునేందుకు వ్యాపారస్తులు ముక్కలుగా కత్తిరించి ఇచ్చేవారు. ఇటీవల కాలంలో పరిశుభ్రత పెరిగిన దృష్ట్యా ఇది అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి పుచ్చకాయ సంపూర్ణంగా పండిందని తెలుసుకోవాలంటే కొన్ని సులభమైన మార్గాలున్నాయి.
మీరు పుచ్చకాయ కొనేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోండి.
1. బరువును గమనించండి
పుచ్చకాయ సంపూర్ణంగా పండిందా లేదా అని చెక్ చేయాలంటే ఉత్తమమైన పద్దతి బరువు చెక్ చేయడం. ఒకే సైజులో ఉన్న రెండు పుచ్చకాయలను మీ చేతుల్లోకి తీసుకొని బరువు చెక్ చేయండి. బరువున్న పుచ్చకాయ బాగా పండి ఎక్కువ రసవంతంగా ఉంటుంది.
2. పుచ్చకాయను కొట్టి శబ్దాన్ని గమనించండి..
డోర్ తట్టినట్లు మీ మెటికలతో పుచ్చకాయను కొట్టండి. సంపూర్ణంగా పండిన పుచ్చకాయ నుంచి తక్కువ శబ్ధం వస్తుంది. ఇది బోలుగా లేదా ఫ్లాట్‌గా అనిపిస్తే, అది ఎక్కువగా పండినది. హైపీచ్ శబ్ధం వచ్చినట్లయితే అది ఇంకా పండలేదని గమనించాలి.
3. పుచ్చకాయ వాసన చూడండి..
మీ ముక్కు దగ్గర పెట్టుకొని పుచ్చకాయ వాసనను గమనించండి. పుచ్చకాయ తియ్యట వాసన విలక్షణంగా ఉంటుంది. పై తొక్క నుంచి మీరు ఎలాంటి వాసనను పసిగట్టలేకపోతే..అది తక్కువగా పండిందని గుర్తించాలి. పుచ్చకాయ సువాసన ఎక్కువగా ఉంటే అది బాగా పండిందని అర్థం.
4. పుచ్చకాయ ఆకృతిని పరిశీలించండి. .
పుచ్చకాయ పైతొక్క ఆకృతి సాధారణంగా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇతర పండ్లలా కాకుండా, దీని పైతొక్క చాలా గట్టిగా ఉంటుంది. పండని పుచ్చకాయ చాలా గట్టి తొక్కను కలిగి ఉంటుంది. సరిగ్గా పండిన పుచ్చకాయ పైతొక్క మీ వేళ్లతో నొక్కినప్పుడు మెత్తబడినట్లు అనిపిస్తే అది బాగా పండినది అని తెలుసుకోవాలి.
5. రంగు చెక్ చేయుట
ఇది పుచ్చకాయను పండిందా లేదా తెలుసుకునేందుకు సులభమైన పద్దతి. పుచ్చకాయ పైతొక్క కలరు ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చగా ఉంటే సంపూర్ణంగా పండింది అని అర్థం. పసుపు పచ్చ కలర్‌లో ఉంటే అవి పండించిన స్థలంలోనే పక్వానికి వచ్చినట్లు గ్రహించాలి. పుచ్చకాయ కలర్ తెలుపురంగులో ఉంటే అది ఇంకా పక్వానికి రాలేదని గమనించాలి.