Skil India: నూతన పార్లమెంట్ ప్రాజెక్టులో భాగమైన 910 మంది కార్పెంటర్లకు సర్టిఫికెట్ల ప్రదానం

ABN , First Publish Date - 2023-03-30T19:15:42+05:30 IST

నూతన పార్లమెంటు భవన నిర్మాణంలో భాగమైన 910 మంది కార్పెంటర్లకు స్కిల్ ఇండియా సర్టిఫికెట్లు ప్రదానం చేసింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాకత

Skil India: నూతన పార్లమెంట్ ప్రాజెక్టులో భాగమైన 910 మంది కార్పెంటర్లకు సర్టిఫికెట్ల ప్రదానం

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవన నిర్మాణంలో భాగమైన 910 మంది కార్పెంటర్లకు స్కిల్ ఇండియా సర్టిఫికెట్లు ప్రదానం చేసింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాకత (MSDE) నేతృత్వంలోని ఫర్నిచర్ అండ్ ఫిటింగ్ స్కిల్ కౌన్సిల్ (FFSC), ఎన్ఎండీసీ జ్యురిస్‌డిక్షన్, నార్సి గ్రూప్ భాగస్వామ్యంతో రికగ్నైజేషన్‌ ఆఫ్‌ ప్రయర్‌ లెర్నింగ్‌ (RPL) కింద 910 మంది కార్పెంటర్లకు శిక్షణ కూడా అందించింది. పార్లమెంటు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఎస్‌డీఈ మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ కేకే ద్వివేది, ఎంఓహెచ్‌యూఏ మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ దీపక్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

స్కిల్ ఇండియా ప్రతిష్ఠాత్మక పథకమైన ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన (PMKVY)లో ఆర్‌పీఎల్ భాగం. ఎంఎస్‌డీఈతో పాటు నార్సి గ్రూప్‌ గతంలో పలు ఆర్‌పీఎల్‌ పథకాల ద్వారా 6 వేల మంది కార్పెంటర్లకు శిక్షణ అందించాయి. ఈ సందర్భంగా డాక్టర్ కేకే ద్వివేదీ మాట్లాడుతూ.. కార్పెంటర్లకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంతోపాటు సర్టిఫికెట్లు అందించడం ద్వారా తగిన సాధికారిత అందించడంలో ఈ వేడుక ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు.

narsi1.jpg

నర్సిగ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఫిటింగ్స్ స్కిల్‌ కౌన్సిల్‌ చైర్మన్ నర్సి డీ కులారియా మాట్లాడుతూ.. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడం తమ కార్పెంటర్‌ కమ్యూనిటీకి అత్యంత గౌరవమని అన్నారు. స్వయంగా కార్పెంటర్‌ను అయిన తాను నైపుణ్యాభివృద్ధి, సామర్ధ్యం మెరుగుపరుచుకోవడంలో సర్టిఫికేషన్‌ విలువను గుర్తించినట్టు చెప్పారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 25వేల మంది కార్పెంటర్లకు తగిన నైపుణ్యాలను అందించడంతో పాటు సర్టిఫికేషన్‌లను అందించేందుకు కృషి చేస్తామన్నారు.

Updated Date - 2023-03-30T19:15:42+05:30 IST