Hyderabad నిక్మర్‌లో పీజీ ప్రోగ్రామ్‌లు

ABN , First Publish Date - 2023-01-25T16:31:34+05:30 IST

హైదరాబాద్‌ (Hyderabad)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (National Institute of Construction Management and Research)(నిక్మర్‌) - పోస్ట్‌

Hyderabad నిక్మర్‌లో  పీజీ ప్రోగ్రామ్‌లు
పీజీ ప్రోగ్రామ్‌లు

హైదరాబాద్‌ (Hyderabad)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (National Institute of Construction Management and Research)(నిక్మర్‌) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవి ఫుల్‌ టైం ఆన్‌ క్యాంపస్‌ ప్రోగ్రామ్‌లు. సంస్థ నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఎన్‌సీఏటీ), గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, రేట్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ ఏసీఎం)

  • ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్‌/ఆర్కిటెక్చర్‌/ప్లానింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ ఈపీఎం)

  • ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ సస్టయినబుల్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌(పీజీపీ ఎస్‌ఈఎం)

  • ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. కనీసం 50 శాతం మార్కులతో ఏదేని ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ ఎల్‌ఎస్‌సీఎం)

  • ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌/ మేనేజ్‌మెంట్‌/ ఎకనామిక్స్‌/ మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ అగ్రికల్చర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ క్యూఎస్‌సీఎం)

  • ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ హెల్త్‌, సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ హెచ్‌ఎస్‌ఈఎం)

  • ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. కనీసం 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్‌సీఏటీ 2023 వివరాలు

  • పరీక్షని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. దీనికి 180 మార్కులు నిర్దేశించారు. ఇందులో క్వాంటిటేటివ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ నుంచి 72 మార్కులకు, డేటా ఇంట్రప్రిటేషన్‌ నుంచి 36 మార్కులకు, వెర్బల్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ నుంచి 72 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఇందులో సాధించిన మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

  • గ్రూప్‌ డిస్కషన్‌కు 20 మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 30 మార్కులు, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌కు 70 మార్కులు ప్రత్యేకించారు.

దరఖాస్తు ఫీజు: ఒక ప్రోగ్రామ్‌నకు రూ.2100; ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లకు రూ.2620

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 1

ఎన్‌సీఏటీ 2023, గ్రూప్‌ డిస్కషన్స్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు

ఫలితాలు విడుదల: మార్చి 6

ట్యూషన్‌ పీజు చెల్లించేందుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 5న

ప్రోగ్రామ్‌లు ప్రారంభం: జూలై 17 నుంచి

వెబ్‌సైట్‌: nicmar.ac.in/hyderabad

Updated Date - 2023-01-25T16:31:35+05:30 IST