Hyderabad Naarmలో డిప్లొమా ప్రవేశాలు

ABN , First Publish Date - 2023-01-26T12:23:00+05:30 IST

హైదరాబాద్‌ (Hyderabad), రాజేంద్రనగర్‌లోని ఐకార్‌-నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (National Academy of Agricultural Research Management) (నార్మ్‌) డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్‌లు

Hyderabad Naarmలో డిప్లొమా ప్రవేశాలు
డిప్లొమా ప్రవేశాలు

హైదరాబాద్‌ (Hyderabad), రాజేంద్రనగర్‌లోని ఐకార్‌-నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (National Academy of Agricultural Research Management) (నార్మ్‌) డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. దూరవిద్య విధానంలో నిర్వహించే ఈ ప్రోగ్రామ్‌లకు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (University of Hyderabad) సహకారం అందిస్తోంది. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్‌లు ఉంటాయి. ఆన్‌లైన్‌ సెషన్స్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తారు. అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

డిప్లొమా ఇన్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ (డీటీఎంఏ): ఈ ప్రోగ్రామ్‌లో ఆరు కోర్సులతోపాటు రెండు ప్రాజెక్ట్‌ వర్క్‌లు ఉంటాయి. ఒక్కోదానికి 4 క్రెడిట్స్‌ చొప్పున మొత్తం 32 క్రెడిట్స్‌ నిర్దేశించారు. మొదటి సెమిస్టర్‌లో ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ, ఐపీ ఇన్ఫర్మాటిక్స్‌, టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ కోర్సులు; ఒక ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటాయి. రెండో సెమిస్టర్‌లో ఐపీ ప్రాసిక్యూషన్‌ అండ్‌ లిటిగేషన్‌, రూరల్‌ ఇన్నోవేషన్‌, టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ కోర్సులు; మరో ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు సొసైటీ ఫర్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌(స్టెమ్‌)లో మెంబర్‌షిప్‌ కోసం నమోదు చేసుకోవచ్చు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్‌/ సోషల్‌ సైన్సెస్‌/ఫిజికల్‌ సైన్సెస్‌/ మేనేజ్‌మెంట్‌/ లైఫ్‌ సైన్సెస్‌/ ఇంజనీరింగ్‌/ లా విభాగాల్లో డిగ్రీ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

ప్రోగ్రామ్‌ ఫీజు: కోర్సు మెటీరియల్స్‌ను హార్డ్‌ కాపీ ద్వారా పొందాలంటే రూ.25,000. అదే సాఫ్ట్‌ కాపీ(ఈ - బుక్స్‌) అయితే రూ.22,000.

ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 10 నుంచి

డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ (డీఈటీఎం): దీనికి మొత్తం 29 క్రెడిట్స్‌ నిర్దేశించారు. మొదటి సెమిస్టర్‌లో ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ-1 కోర్సుకి 4, సైకాలజీ ఆఫ్‌ లెర్నింగ్‌కు 4, ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైన్‌ అండ్‌ కోర్స్‌ డెవల్‌పమెంట్‌కు 3, డైమెన్షన్స్‌ ఆఫ్‌ టీచింగ్‌కు 3 క్రెడిట్స్‌ కేటాయించారు. రెండో సెమిస్టర్‌లో ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ-2కి 4, మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు 4, ఎవల్యూషన్‌ అండ్‌ టెస్టింగ్‌కు 4, ఎథికల్‌ ఇష్యూస్‌ ఇన్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీకి 3 క్రెడిట్స్‌ ప్రత్యేకించారు. వీటికి సంబంధించిన స్టడీ మెటీరియల్‌, వీడియో మాడ్యూల్స్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ విధానాల్లో కాంటాక్ట్‌ క్లాసులు ఉంటాయి. ప్రతి కోర్సు చివర ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌(అసైన్‌మెంట్స్‌/మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు); సెమిస్టర్‌ చివరలో టర్మ్‌ ఎండ్‌ ఎగ్జామినేషన్స్‌ ఉంటాయి. కాంటాక్ట్‌ క్లాసుల అటెండెన్స్‌కి 10 శాతం, ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌కి 30 శాతం, సెమిస్టర్‌ ఎండ్‌ ఎగ్జామ్‌కి 60 శాతం వెయిటేజీ ఉంటుంది.

అర్హత: ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు ఈ ప్రోగ్రామ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ప్రోగ్రామ్‌ ఫీజు రూ.20,000. దీనిని రెండు వాయిదాల్లో చెల్లించవచ్చు. ప్రోగ్రామ్‌ పూర్తి చేసినవారికి యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఇందుకోసం రెండో సెమిస్టర్‌ ఫీజుతో పాటు అదనంగా రూ.500 చెల్లించాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.300

ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28

చిరునామా: ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌, ఐకార్‌-నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌-500030

వెబ్‌సైట్‌: naarm.org.in

Updated Date - 2023-01-26T12:23:02+05:30 IST