Notification: ఐఐఎస్‌సీ, ఐఐటీల్లో సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు

ABN , First Publish Date - 2023-08-26T12:05:09+05:30 IST

ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలయిన ఐఐఎ్‌ససి బెంగళూరు, ఐఐటీల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ-పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశానికి ‘జామ్‌(జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌)’ చక్కని మార్గం. అయితే ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ల పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఇంజనీరింగ్‌ కోర్సులు.

Notification: ఐఐఎస్‌సీ, ఐఐటీల్లో సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు

ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలయిన ఐఐఎ్‌ససి బెంగళూరు, ఐఐటీల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ-పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశానికి ‘జామ్‌(జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌)’ చక్కని మార్గం. అయితే ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ల పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఇంజనీరింగ్‌ కోర్సులు. ప్రస్తుతం మారుతున్న సమాజ అవసరాల మేరకు ఐఐటీలు ఇంజనీరింగ్‌ కోర్సులతో పాటు వివిధ సైన్స్‌ సబ్జెక్టులు అలాగే వాటిలో పరిశోధనలకూ అవకాశం కల్పిస్తున్నాయి. సంబంధిత సబ్జెక్టులతో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సైన్స్‌ను ప్రధాన కెరీర్‌గా ఎంచుకొనే వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2004-05 విద్యా సంవత్సరం నుంచి ‘జామ్‌’ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఒక్కో ఏడు ఒక్కో ఐఐటీ ఈ ప్రవేశ పరీక్ష బాధ్యతలను తీసుకుంటుంది. ఈ ఏడాది జామ్‌-2024ని ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తోంది. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఐఐటీలు, ఐఐఎస్‌సి బెంగళూరుల్లో ఎమ్మెస్సీ, పోస్ట్‌ బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఐఐటీల్లోని వివిధ కోర్సుల్లో సుమారు 3000 వరకు సీట్లు ఉన్నాయి. ఈ సీట్లన్నింటినీ జామ్‌లో సాధించిన స్కోరు ఆధారంగా భర్తీ చేస్తారు. అదేవిధంగా వివిధ ఐఐఎస్సీల్లో ఉన్న మరో 2000 సీట్లను కూడా సీసీఎంఎన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే వివిధ జాతీయ స్థాయి సంస్థల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ(టెక్నాలజీ), ఎంఎస్‌ రీసెర్చ్‌, ఎమ్మెస్సీ-ఎంటెక్‌, డ్యూయల్‌ డిగ్రీ, జాయింట్‌ ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో కూడా జామ్‌ 2024 స్కోరు ఆధారంగా సీట్లు పొందవచ్చు.

ఐఐటీలు: భిలాల్‌, భువనేశ్వర్‌, బాంబే, ఢిల్లీ, ధన్‌బాద్‌, గాంధీనగర్‌, గువహటి, హైదరాబాద్‌, ఇండోర్‌, జమ్మూ, జోధ్‌పూర్‌, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, మండీ, పాలక్కడ్‌, పట్నా, రూర్కీ, రోపార్‌, తిరుపతి, వారణాసి.

ఎంపిక విధానం: జనరల్‌ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 శాతం వస్తే సరిపోతుంది. లాంగ్వేజెస్‌, మెయిన్‌, సబ్సిడరీ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను కలిపి లెక్కిస్తారు.

పరీక్ష విధానం: పరీక్షను ఆన్‌లైన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 100 నగరాల్లో నిర్వహిస్తారు. ఏడు టెస్ట్‌ పేపర్లు ఉంటాయి. అవి... బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, జియాలజీ, మేథమెటిక్స్‌, మేథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, ఇవన్నీ గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనే ఉంటాయి. టెస్ట్‌ పేపర్లలో మూడు రకాల ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఇస్తారు. మల్టిపుల్‌ చాయిస్‌ క్వశ్చన్స్‌(ఎంసీక్యూ), మల్టిపుల్‌ సెలెక్ట్‌ క్వశ్చన్స్‌(ఎంఎ్‌సక్యూ), న్యూమరికల్‌ ఆన్సర్‌టైప్‌ క్వశ్చన్స్‌(ఎన్‌ఏటీ). పరీక్ష సమయం మూడు గంటలు. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ ఉదయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఉంటుంది. ఈ సెషన్‌లో కెమిస్ట్రీ(సీవై), జియాలజీ(జీజీ), మేథమెటిక్స్‌(ఎంఏ) టెస్ట్‌ పేపర్లు ఉంటాయి. రెండో సెషన్‌ మఽధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. ఈ సెషన్‌లో బయోటెక్నాలజీ(బీటీ), ఎకనామిక్స్‌(ఈఎన్‌), మేథమెటికల్‌ స్టాటిస్టికల్‌(ఎమ్మెస్‌), ఫిజిక్స్‌(పీహెచ్‌) టెస్ట్‌ పేపర్లు ఉంటాయి.

  • ఐఐటీలు అందించే ఆయా సబ్జెక్టులకు అనుగుణంగా పరీక్షాంశాలు ఉంటాయి. కేవలం ఎమ్మెస్సీకి మాత్రమే కోర్సులు పరిమితం కావు. పీహెచ్‌డీతో కలిసి కంబైన్డ్‌ కోర్సులు కూడా ఉన్నాయి. కొన్ని ప్యూర్‌ అప్లయిడ్‌ సైన్స్‌లు, మిగతావి జాయింట్‌ ప్రోగ్రామ్స్‌. ఒకటి లేదంటే రెండు పేపర్లనూ అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. పరీక్ష షెడ్యూల్‌ను అనుసరించి వీటిని ఎలా ఎంపిక చేసుకోవాలో అవగాహన కలుగుతుంది. పరీక్ష ఫీజు ఒక్కో పేపరుకు ఒక్కోలా ఉం టుంది. రెండో పేపర్‌ను కూడా రాయాలంటే అదనంగా ఫీజు చెల్లించాలి.

పరీక్ష ఫీజు: మహిళలు,ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఒక టెస్ట్‌ పేపర్‌కు రూ.900, రెండు టెస్ట్‌ పేపర్లకు 1250 చెల్లించాలి. మిగతా అభ్యర్థులు ఒక టెస్ట్‌ పేపర్‌కు కే,1800, రెండు టెస్ట్‌ పేపర్లకు రూ.2500 చెల్లించాలి.

పరీక్ష కేంద్రాలు: దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో పరీక్షను నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంఽధించి హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్షను రాయవచ్చు.

ప్రిపరేషన్‌ విధానం

సిలబ్‌సపై అవగాహన పెంచుకోవాలి: అభ్యర్థి ముందుగా జామ్‌ 2024 నోటిఫికేషన్‌ను, అందులో పేర్కొన్న సిలబ్‌సను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సిలబ్‌సను పూర్తిగా అవగాహన చేసుకొన్న తరవాతే ప్రిపరేషన్‌ను మొదలు పెట్టాలి. పాఠ్యాంశాలను కఠినమైనవి, మోస్తారుగా ఉన్నవి, సులువైనవి ఇలా... విభాగాల వారీగా విభజించుకొని చదువుకోవాలి. ఇలా విభజించుకున్నప్పుడు మాత్రమే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

పుస్తకాల ఎంపిక: ప్రిపరేషన్‌లో రెండో దశ అవసరమైన రిఫరెన్స్‌ బుక్స్‌, స్టడీ మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవడం. గ్రాడ్యుయేషన్‌ స్థాయి పాఠ్య పుస్తకాలు సరిపోతాయి, కానీ, మార్కెట్లో అంశాల వారీగా లభించే పుస్తకాలు తీసుకొంటే మరీ మంచిది. ఎందుకంటే వీటిల్లో ప్రవేశ పరీక్ష కోణంలో అంశాలను వివరిస్తారు. కాబట్టి అభ్యర్థులు అకడమిక్‌ పుస్తకాలకు తోడు కాంపిటేటీవ్‌ పుస్తకాలనూ చదవడం మంచిది.

  • ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకొని కావలసిన సమాచారాన్ని సేకరించుకోవచ్చు. గత పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, టాపర్స్‌ ఇంటర్వ్యూలు వంటివెన్నో నేడు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎన్నో పుస్తకాలు, మరెన్నో మోడల్‌ పేపర్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రిపరేషన్‌ను కొనసాగించవచ్చు.

టైం టేబుల్‌: ప్రిపరేషన్‌లో అతి ముఖ్యమైనది టైంటేబుల్‌ను రూపొందించుకోవడం. ఉన్న కొద్ది సమయంలో నిర్దేశిత సిలబ్‌సను పూర్తి చేయడం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థులు అందుబాటులో ఉన్న సమయాన్ని, సిలబ్‌సను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆ మేరకు అధ్యయనాన్ని కొనసాగించాలి. పరీక్ష తేదీకి రెండు నెలలు ముందుగానే సిలబ్‌సను పూర్తి చేయాలి. ఆ తరవాత రెండు నెలలు సమయాన్ని రివిజన్‌కు కేటా యించుకోవాలి.

ప్రాక్టీస్‌: కేవలం సిలబ్‌సలోని అంశాలను ఆసాంతం చదువుతూ పోతే లాభం ఉండదు. అందుకు తగ్గ ప్రాక్టీస్‌ కూడా ఉండాలి. కాబట్టి అభ్యర్థులు తాము చేసిన అధ్యయనాన్ని ప్రాక్టీస్‌ టెస్ట్‌ల ద్వారా పరీక్షించుకోవాలి. ఎందులో వెనుకబడి ఉన్నారో గ్రహించాలి. ఆ మేరకు సరిదిద్దుకోవాలి. అప్పుడే విజయాన్ని సొంతం చేసుకుంటారు.

మాక్‌ టెస్ట్‌లు: వీలైనన్ని మోడల్‌ టెస్ట్‌లను, పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. కొన్నేళ్లుగా జామ్‌ పరీక్షను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులను కూడా అటెండ్‌ చేయాలి. ఇలా చేయడంతో అభ్యర్థులకు ప్రశ్నల సరళి తెలియడంతో పాటు, సమయ సద్వినియోగమూ అలవడుతుంది.

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: 2023 సెప్టెంబరు 5

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 2023 అక్టోబరు 13

అడ్మిషన్‌ కార్డుల డౌన్‌లోడ్‌ ప్రారంభం: 2024 జనవరి 8

జామ్‌ పరీక్ష తేదీ: 2024 ఫిబ్రవరి 11

ఫలితాల ప్రకటన: 2024 మార్చి 22

వెబ్‌సైట్‌: https://jam.iitm.ac.in/

Updated Date - 2023-08-26T12:05:09+05:30 IST