AP PolyCET: ఏపీ పాలిసెట్-2023 ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2023-05-20T12:01:16+05:30 IST
ఏపీ పాలిసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి విడుదల

విజయవాడ: ఏపీ పాలిసెట్-2023 (AP PolyCET) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,43,625 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయగా... 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 86.35 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 88.90 శాతం, బాలురు 84.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు https://polycetap.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.