తిరుగుబాటు నీ చిరునామా!
ABN , First Publish Date - 2023-09-09T03:51:10+05:30 IST
కాళన్న... నీ జీవితం ఒక మహోద్యమానికి మనిషి రూపమై చైతన్య ప్రభావానికి

కాళన్న... నీ జీవితం
ఒక మహోద్యమానికి
మనిషి రూపమై
చైతన్య ప్రభావానికి
ఉధృతినిస్తుంది!
నీ అక్షరాలు–
సామాన్యుల శస్త్రాలై
ప్రజాకంటక ప్రభుత్వాల గుండెల్లో
ఫిరంగులై పేలతాయి!
నీ జ్ఞాపకం–
కోటి ఊపిరుల ఉద్యమమై
కాలగమనంపై
కల్లోల సంతకం చేస్తుంది!
నీ తెగువ–
ధైర్యాన్ని పిడికిలి నిండా నింపి
పోరాట యోధులకు
దిక్సూచిగా నిలుస్తుంది!
కాళన్న... నీకు మరణం లేదు
అన్యాయం ఉన్నచోట
ధిక్కారమై బతుకుతావు
జాగృత జనావళి గుండెల్లో
జెండాగా ఎగురుతావు
స్వార్థపరుల ఉలికిపాటు
– నీ ఉనికి
తిరుగుబాటు
– నీ చిరునామా!
– శోభ రమేష్
(నేడు ప్రజాకవి కాళోజి 110వ జయంతి)