22 ఏళ్ల ఈ కుర్రాడు.. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దయిన మహిళను ప్రేమించాడు.. ప్రస్తుతం అతడి పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2023-02-15T19:32:21+05:30 IST

ఆ యువకుడి వయసు 22 ఏళ్లు.. అతడు తన కంటే వయసులో 20 ఏళ్లు పెద్దదైన 42 ఏళ్ల మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నాడు.. వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ మహిళ ఈ కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుని అతడితో కలిసి తిరుగుతోంది..

22 ఏళ్ల ఈ కుర్రాడు.. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దయిన మహిళను ప్రేమించాడు.. ప్రస్తుతం అతడి పరిస్థితి ఏంటంటే..

ఆ యువకుడి వయసు 22 ఏళ్లు.. అతడు తన కంటే వయసులో 20 ఏళ్లు పెద్దదైన 42 ఏళ్ల మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నాడు.. వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ మహిళ ఈ కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుని అతడితో కలిసి తిరుగుతోంది.. విషయం తెలిసి భర్త హెచ్చరించినా ఆమె తన తీరు మార్చుకోలేదు.. చివరకు ప్రియుడి చేతిలోనే అతి దారుణంగా హత్యకు గురైంది.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది.

రాయ్‌పూర్‌కు (Raipur) సమీపంలోని గుధియారికి చెందిన 22 ఏళ్ల మహ్మద్ సుల్తాన్ అనే యువకుడు రెండున్నరేళ్ల క్రితం 42 ఏళ్ల ఇమ్రానాను ఓ బిర్యానీ సెంటర్‌లో కలిశాడు. అక్కడ ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది (Extra Marital Affair). భర్త, ఇద్దరు పిల్లలను పట్టించుకోకుండా మహ్మద్‌తో ఇమ్రానా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేది. కూతురు పెళ్లీడుకు వచ్చినా తన కంటే 20 ఏళ్ల చిన్నవాడితో ఇమ్రానా శృంగారం సాగించేది. విషయం తెలిసి భర్త హెచ్చరించినా ఇమ్రానా తన తీరు మార్చుకోలేదు.

న్యాయమూర్తే కన్నీళ్లు పెట్టుకున్న అరుదైన ఘటన.. జైల్లో భర్త.. ఏడాది కూతురిని తాకట్టు పెట్టిన భార్య.. అప్పంతా తీర్చేసింది కానీ..

ఏ పనీ లేకుండా తిరిగే మహ్మద్‌కు ఇమ్రానా అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుండేది. తాజాగా మరోసారి ఇమ్రానాను మహ్మద్ డబ్బులు అడిగాడు. అయితే డబ్బులు ఇచ్చేందుకు ఇమ్రానా నిరాకరించింది. అంతేకాదు తన కూతురికి పెళ్లి కుదిరిందని, గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగింది. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహ్మద్.. ఇమ్రానా తలను పలుసార్లు గోడకేసి కొట్టాడు. అనంతరం దిండుతో ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు (Crime News).

Updated Date - 2023-02-15T19:32:23+05:30 IST