అబ్బో.. వీళ్ల పైత్యం మామూలుగా లేదుగా.. ఏకంగా ఎస్‌ఐపైనే..

ABN , First Publish Date - 2023-05-02T12:42:25+05:30 IST

ఎస్‌ఐ, ఆయన ఇద్దరు కుమారులపై దాడికి పాల్పడిన ఐదుగురు బైక్‌ రేసర్ల(Bike racers) కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అబ్బో.. వీళ్ల పైత్యం మామూలుగా లేదుగా.. ఏకంగా ఎస్‌ఐపైనే..

ప్యారీస్‌(చెన్నై): స్థానిక కొడుంగైయూర్‌ ప్రాంతంలో ఎస్‌ఐ, ఆయన ఇద్దరు కుమారులపై దాడికి పాల్పడిన ఐదుగురు బైక్‌ రేసర్ల(Bike racers) కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొడుంగైయూర్‌ సింగారం వీధికి చెందిన భాస్కర్‌ ఎస్‌ఐగా పనిచేస్తూ విధులు ముగించుకొని శనివారం రాత్రి 9 గంటలకు ఇంటికి తిరిగొచ్చారు. అప్పుడు ఆ వీధిలో బైక్‌ రేస్‌లో పాల్గొన్న యువకులను నిలదీయడంతో వారు అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయారు. గంట అనంతరం ఆ యువకులు భాస్కర్‌(Bhaskar) ఇంటికి వెళ్లి ఆయనతో పాటు ఆయన ఇద్దరు కుమారులపై దాడికి పాల్పడడంతో ఆ ముగ్గురికి గాయాలయ్యాయి. దీనిపై అందజేసిన ఫిర్యాదు మేరకు కొడుంగైయూర్‌ పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

nani11.2.jpg

Updated Date - 2023-05-02T12:42:25+05:30 IST