17 ఏళ్ల కుర్రాడి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. చివరగా రాసిన లేఖలో అయిదుగురి పేర్లు..!

ABN , First Publish Date - 2023-01-25T15:13:35+05:30 IST

జైపూర్‌లోని (Jaipur) ఓ కాలేజ్‌లో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అమిత్ మీనా (17) ఆత్మహత్య చేసుకున్నాడు. అమిత్ మృతదేహం తన గదిలోనే వేలాడుతూ కనిపించింది. పోలీసులు, కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గదిలో సోదా చేయగా నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది

17 ఏళ్ల కుర్రాడి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. చివరగా రాసిన లేఖలో అయిదుగురి పేర్లు..!

జైపూర్‌లోని (Jaipur) ఓ కాలేజ్‌లో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అమిత్ మీనా (17) ఆత్మహత్య చేసుకున్నాడు. అమిత్ మృతదేహం తన గదిలోనే వేలాడుతూ కనిపించింది. పోలీసులు, కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గదిలో సోదా చేయగా నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఐదుగురు విద్యార్థుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అమిత్ ఆ లేఖలో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు (Rajasthan Crime News).

17 ఏళ్ల అమిత్ 12వ తరగతిలో 65 శాతం మార్కులు సాధించి పై చదువుల కోసం 4 నెలల క్రితం జైపూర్ వెళ్లాడు. సుబోధ్ కాలేజీలో బీఎస్సీ మొదటి సంవత్సరంలో చేరాడు. మాలవ్య నగర్ మోడల్ టౌన్‌లో అమిత్ ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. సుమిత్ అనే మరో విద్యార్థితో కలిసి ఓ గది అద్దెకు తీసుకుని ఉండేవాడు. సుమిత్, అతని స్నేహితులు అమిత్‌ను ఏడిపించేవారు. అమిత్‌ చేత బలవంతంగా ఆల్కహాల్ కలిపిన శీతల పానీయాలను చాలాసార్లు తాగించారు. అమిత్‌ ఒప్పుకోకపోతే బెదిరించి కొట్టేవారు. ఈ విషయాన్ని అమిత్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

వికాస్ అనే స్నేహితుడు కొంత కాలం క్రితం అమిత్ నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు. అవి తిరిగి ఇవ్వమని అడిగితే వికాస్ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన స్నేహితులతో కలిసి కొట్టాడు. స్నేహితుల వేధింపులకు తాళలేక అమిత్ తన గదిలోనే ఉరేసుకుని చనిపోయాడు (student commits suicide). సుమిత్, అతని స్నేహితులు తనను నాలుగు నెలలుగా చిత్రహింసలు పెడుతున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని, తనను చదవనివ్వడం లేదని సూసైడ్ నోట్‌లో అమిత్ పేర్కొన్నాడు. ఆ సూసైడ్ నోట్ ప్రకారం సదరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-01-25T15:13:37+05:30 IST