ఎమ్మెల్యేను హతమారుస్తామంటూ బెదిరింపులు.. ఆ తర్వాత ఏమైందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-22T12:14:45+05:30 IST

పట్టణంలోని రహీం లే అవుట్‌ ప్రచారంలో తన ఇంట్లోకి చొరబడి ప్రాణాలు తీస్తామని బెదరించినవారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే ఎస్‌

ఎమ్మెల్యేను హతమారుస్తామంటూ బెదిరింపులు.. ఆ తర్వాత ఏమైందో తెలిస్తే..

బంగారపేట(బెంగళూరు): పట్టణంలోని రహీం లే అవుట్‌ ప్రచారంలో తన ఇంట్లోకి చొరబడి ప్రాణాలు తీస్తామని బెదరించినవారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే ఎస్‌ఎన్‌ నారాయణస్వామి(SN Narayanaswamy) వందలాదిమంది అనుచరులతో కలసి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. సోమవారం పట్టణ శివారులోని శ్యామ్‌ ఆసుపత్రి ఎదుట జేడీఎస్‌ సమావేశానికి బెంగళూరు(Bangalore) నుంచి మాజీ కార్పొరేటర్‌ ఇమ్రాన్‌ అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రహీం లే అవుట్‌లో జమీర్‌, సిరాజ్‌ అహ్మద్‌ల తరపున ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే నారాయణస్వామి ఇంట్లోకి చొరబడి ప్రాణాలు తీస్తామని బెదరించారు’. ఈ అంశంపై చర్చనీయాంశమైంది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ జేడీఎస్‌ అభ్యర్థి మల్లేశ్‌బాబు మద్దతుతోనే ఆయన మాట్లాడారని ఆరోపించారు. ఎన్నికలు ఇంకా ప్రకటించలేదని అయితే జేడీఎస్‌ పార్టీకి చెందిన మల్లేశ్‌బాబు కాంగ్రెస్‌ కార్యకర్తలను బెదరించేందుకు బెంగ ళూరు నుంచి రౌడీలను రప్పించారన్నారు. ప్రశాంతంగా ఉన్న బంగారపేటలో అశాంతికి కారణమవుతున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించరాదనే ఉద్దేశ్యంతోనే పోలీస్‌ స్టేషన్‌(Police station) ఎదుట బైఠాయించి సోమవారం రాత్రంతా నిరసన కొనసాగించారు. రెచ్చగొట్టే వ్యాఖ్య లు చేసిన ఇమ్రాన్‌ పాషా, సిరాజ్‌ అహ్మద్‌, జమీర్‌లపై పట్టణ పోలీసులకు ఆజం షరీఫ్‌ ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేసేంతవరకు ధర్నాను విరమించేది లేదన్నారు. ఈ ఘటన రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యంగా ఉంద న్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ధర్నా కొనసాగింది. చివరకు సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ హామీతో ధర్నాను వీడారు. మొత్తానికి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైంది.

Updated Date - 2023-03-22T12:14:45+05:30 IST