తల్లిదండ్రులు పెళ్లిచూపులకు వెళ్లారు.. ఇంట్లో ఉన్న అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ చివరికి..
ABN , First Publish Date - 2023-05-25T12:47:41+05:30 IST
స్థానిక మాధవరం తిరుమలై నగర్‌లో తమ్ముడిని కత్తితో హతమార్చిన అన్నను పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలై నగర్‌లో నివసిస్తున్న

ప్యారీస్(చెన్నై): స్థానిక మాధవరం తిరుమలై నగర్‌లో తమ్ముడిని కత్తితో హతమార్చిన అన్నను పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలై నగర్‌లో నివసిస్తున్న వెంకటేష్‌కు సురేష్(26), శ్రీనివాసులు(24), శ్రీకాంత్(20) అనే ముగ్గురు కుమారులున్నారు. సురేష్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా, శ్రీనివాసులు కాల్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. ఇక శ్రీకాంత్(Srikanth) ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సురేష్‌కు వధువును చూసేందుకు తల్లిదండ్రులు ఆంధ్రాకు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు అన్నదమ్ములు మాత్రమే ఇంట్లో వున్నారు. ఈ సందర్భంగా సురేష్ ఇద్దరు తమ్ముళ్లపై దాడి చేశాడు. క్షతగాత్రులను చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించగా, సురేష్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న మాధవరం ఇన్‌స్పెక్టర్ శివకుమార్ సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ సమయంలో ఓ ఇంట్లో దాగిన సురేష్‌ను అరెస్టు చేశారు. అయితే ఆసుపత్రి లో చేరిన శ్రీనివాసులు బుధవారం కన్ను మూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.