భర్తకు విమానాశ్రయంలో ఉద్యోగం.. ఉదయాన్నే విధులకు వెళ్లిన అతనికి ఫోన్.. భార్య ఉరివేసుకుందని...
ABN , First Publish Date - 2023-11-19T09:26:37+05:30 IST
తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని జీఎం వీధిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రేణిగుంట అర్బన్ పోలీసుల

రేణిగుంట(తిరుపతి): తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని జీఎం వీధిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రేణిగుంట అర్బన్ పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని వాణియంబాడికి చెందిన దిలీపన్‌కు అదే ఊరికి చెందిన ఉదయప్రియకు(25)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. దిలీపన్ చెన్నై విమానాశ్రయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి. అక్కడి నుంచి మూడేళ్ల క్రితం బదిలీపై రేణిగుంట విమానాశ్రయానికి(Renigunta Airport) వచ్చాడు. జీఎం వీధిలోని అద్దె ఇంట్లో భార్యతో కలిసి ఉంటున్నాడు. శనివారం ఉదయం యథావిధిగా విధులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఉదయప్రియ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. కాగా పిల్లలు కలగలేదని తరచూ ఉదయప్రియ బాధపడుతూ ఉండేదని తెలుస్తోంది. మృతురాలి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు.