ఇంట్లో ఉన్న బాలికపై కన్నేసిన సవతి తండ్రి.. నాన్నమ్మకు తెలిసినా పట్టించుకోలేదు.. చివరకు తల్లికి చెబితే..

ABN , First Publish Date - 2023-01-15T17:07:11+05:30 IST

ఓ వ్యక్తి వావి వరసలు మరించి మృగంలా ప్రవర్తించాడు.. సవతి కూతురిపైనే కన్నేశాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ తర్వాత ప్రతిరోజూ ఆమెను బెదిరిస్తూ శారీరకంగా వేధిస్తున్నాడు.. బాలిక తనపై జరుగుతున్న అత్యాచారం గురించి నాన్నమ్మకు చెబితే ఆమె పట్టించుకోలేదు..

ఇంట్లో ఉన్న బాలికపై కన్నేసిన సవతి తండ్రి.. నాన్నమ్మకు తెలిసినా పట్టించుకోలేదు.. చివరకు తల్లికి చెబితే..

ఓ వ్యక్తి వావి వరసలు మరించి మృగంలా ప్రవర్తించాడు.. సవతి కూతురిపైనే కన్నేశాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ తర్వాత ప్రతిరోజూ ఆమెను బెదిరిస్తూ శారీరకంగా వేధిస్తున్నాడు.. బాలిక తనపై జరుగుతున్న అత్యాచారం గురించి నాన్నమ్మకు చెబితే ఆమె పట్టించుకోలేదు.. చివరకు విషయం తల్లికి తెలిసి ఆమె ఎదురు తిరిగింది.. దీంతో తల్లీ కూతుళ్లను ఇంటి నుంచి బయటకు గెంటేశారు.. వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది (Madhya Pradesh Crime News).

గ్వాలియర్‌లోని హజీరాలో నివాసముంటున్న ఓ మహిళ తన భర్త చనిపోవడంతో ఏడాది క్రితం మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. తన 17 ఏళ్ల కూతురితో కలిసి రెండో భర్త ఇంట్లో ఉంటోంది. 17 ఏళ్ల బాలికపై సవతి తండ్రి కన్నేశాడు. జనవరి 1వ తేదీ రాత్రి, గదిలో ఒంటరిగా ఉన్న బాలికతో సవతి తండ్రి అసభ్యంగా ప్రవర్తించాడు (Stepfather misbehaved with minor girl). ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే ఇద్దరినీ ఇంటి నుంచి గెంటేస్తానని, తల్లిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక భయపడి ఎవరికీ విషయం చెప్పలేదు.

ఆ బాలిక మౌనాన్ని ఆసరాగా తీసుకున్న సవతి తండ్రి ఆమెతో తప్పుడు పనులు చేయడం ప్రారంభించాడు (Sexual Harassment). బాలిక సవతి తండ్రి వేధింపుల గురించి ఆమె తల్లికి ఫిర్యాదు చేయగా ఆమె మరింత తీవ్రంగా బెదిరించింది. మౌనంగా ఉండకపోతే చదువు ఆపించేస్తానని, ఇంట్లో నుంచి తరిమేస్తానని హెచ్చరించేది. దీంతో బాధితురాలు తన తల్లికి విషయం చెప్పింది. తల్లి ప్రశ్నించడంతో ఇద్దరినీ నిందితులు ఇంటి నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2023-01-15T17:07:13+05:30 IST