SI: ఈ ఎస్సై మామూలోడు కాదు.. ఏం చేశాడో తెలిస్తే మీరుకూడా ఛీ కొట్టకుండా..
ABN , First Publish Date - 2023-11-21T12:47:29+05:30 IST
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్ఐపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

- ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాలికకు లైంగిక వేధింపులు
- ఎస్ఐపై పోక్సో కేసు నమోదు
పెరంబూర్(చెన్నై): ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్ఐపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ధర్మపురి జిల్లాకు చెందిన పళనిస్వామి (28)కి 17 ఏళ్ల బాలికతో 2020లో బాల్యవివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడుండగా, ఎనిమిది నెలల క్రితం భర్తతో గొడవల కారణంగా బాలిక ఏరియూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారిస్తున్న ఎస్ఐ సహదేవన్ (55) యువతిని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న భర్త పళనిస్వామి ఆమెపై దాడి చేయడంతో ఆమెను ప్రభుత్వ హోంకు తరలించారు. ఈ నేపథ్యంలో, బాల్యవివాహం చేసుకున్నట్లు పళనిస్వామి, ఆయన తల్లిదండ్రులపై సహదేవన్ కేసు నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో, హోంలో ఉన్న బాలిక చైల్డ్ హెల్స్‌లైన్ నెంబరును సంప్రదించి, ఎస్ఐ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై కోర్టు ఉత్తర్వులతో పెన్నాగరం మహిళా పోలీ్‌సస్టేషన్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఎస్ఐని అరెస్ట్ చేసి ధర్మపురి శాఖా జైలుకు తరలించారు.