Selfie video: ప్రాణాలు తీసిన సెల్ఫీ వీడియో
ABN , First Publish Date - 2023-05-23T11:12:28+05:30 IST
ఇన్‌స్టా కోసం సెల్ఫీ వీడియో తీసుకుంటూ లారీ కింద పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన తిరువళ్లూ

పెరంబూర్(చెన్నై): ఇన్‌స్టా కోసం సెల్ఫీ వీడియో తీసుకుంటూ లారీ కింద పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన తిరువళ్లూర్ జిల్లాలో జరిగింది. గుమ్మిడిపూండి బొద్దికు ప్పం సమీపంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఒకే ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు ఇన్‌స్టా రీలు తీసుకుంటూ ఆనందంగా వెళ్తున్నారు. ఆ సమయంలో ముందుగా వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తూ దాన్ని సెల్‌ఫోన్(Cell phone)లో చిత్రీకరిస్తున్న సమయంలో హఠాత్తుగా బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ముగ్గురిపై లారీ దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న గుమ్మిడిపూండి సిప్కాట్ పోలీసులు అక్కడకు చేరుకొని చేపట్టిన విచారణలో, మృతులు శ్రీలంక తమిళుల శరణార్థుల శిబిరానికి చెందిన దయాళన్ (19), ఛార్లెస్ (21), జాన్ (20) అని తెలిసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు, ఘటనపై కేసు నమోదుచేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.