Rowdy Satya: ఐదుగురు వ్యక్తులు వేటకొడవళ్లతో వచ్చి.. రౌడీ దారుణహత్య

ABN , First Publish Date - 2023-09-12T08:57:08+05:30 IST

స్థానిక ఎగ్మూరు మాంటియత్‌ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి పేరుమోసిన రౌడీ సత్య (22)ను బైకులపై వచ్చిన గుర్తు తెలియని

Rowdy Satya: ఐదుగురు వ్యక్తులు వేటకొడవళ్లతో వచ్చి.. రౌడీ దారుణహత్య

చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎగ్మూరు మాంటియత్‌ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి పేరుమోసిన రౌడీ సత్య (22)ను బైకులపై వచ్చిన గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు వేటకొడవళ్లతో హత్య చేశారు. పుళల్‌సమీపం కావాంగరై ప్రాంతానికి చెందిన సత్యా ఆదివారం రాత్రి ఎగ్మూరు(Egmoor)కు వెళ్ళి మాంటియత్‌ రోడ్డులోని టీ షాపువద్ద స్నేహితులతోకలసి టీ తాగుతుండగా రెండు బైకుల్లో వచ్చిన ఐదుగురు కత్తులతో దాడిచేశారు. ఈసంఘటనను చూసి స్థానికులు భయంతో పరుగెత్తారు. సత్యా మృతి చెందినట్లు ధ్రువీకరించుకున్న తర్వాతే ఆ దుండగులు బైకుల్లో పారిపోయారు. సమాచారం అందుకున్న ఎగ్మూరు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి సత్యా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేఎంసీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం జరిపించారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో మాధవరం ప్రాంతానికి చెందిన నాయ్‌ రమేష్‌ అనే రౌడీ హత్యకు ప్రతీకారంగా జరిగిందని భావిస్తున్నారు. హంతకుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Updated Date - 2023-09-12T08:57:10+05:30 IST