పెళ్లి చేయడం లేదని కొడుకే గొడ్డలితో దాడి చేశాడు.. ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో అవాక్కైన పోలీసులు.. అసలేం జరిగిందంటే.

ABN , First Publish Date - 2023-03-11T17:09:32+05:30 IST

తనకు పెళ్లి చేయడం లేదని ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. పొలంలో పని చేసుకుంటున్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేశాడు.

పెళ్లి చేయడం లేదని కొడుకే గొడ్డలితో దాడి చేశాడు.. ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో అవాక్కైన పోలీసులు.. అసలేం జరిగిందంటే.

తనకు పెళ్లి చేయడం లేదని ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. పొలంలో పని చేసుకుంటున్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ తల్లి తన కొడుకు గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి గురించి గాలింపులు చేపడుతున్నారు (Crime News).

హర్యానాలోని (Haryana) నార్నాల్‌కు చెందిన సుదీప్ అనే యువకుడు తనకు పెళ్లి కావడం లేదని మనో వేదనకు గురయ్యాడు. తల్లిదండ్రులపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పొలంలో పని చేసుకుంటుండగా కోపంతో అక్కడకు వెళ్లాడు. పెళ్లి (Marriage) గురించి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగి వారిపై గొడ్డలితో దాడి చేశాడు. ఆ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అతడికి 29 ఏళ్లు.. ఆమెకు 22 ఏళ్లు.. ఇద్దరూ లవర్స్.. ప్రేయసి పుట్టిన రోజు నాడే కలలో కూడా ఊహించని సీన్..!

తీవ్ర గాయాల పాలైన వారిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరికీ ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు తెలిపారు. కుమారుడిపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సుదీప్ కోసం గాలిస్తున్నారు.

No Challan for Traffic Violations: రూల్స్‌ను బ్రేక్ చేసినా చలానా విధించమంటూ ట్రాఫిక్ పోలీసుల ప్రకటన.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..!

Updated Date - 2023-03-11T17:25:19+05:30 IST