Movie actor: సినీ నటుడు శేఖర్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు చంపుతామని బెదిరిస్తున్నారు..

ABN , First Publish Date - 2023-05-28T11:45:46+05:30 IST

స్థానిక మైలాపూరు మాజీ శాసనసభ్యుడు, రంగస్థల, సినీ నటుడు ఎస్వీ శేఖర్‌(Film actor SV Shekhar)కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి నానా

Movie actor: సినీ నటుడు శేఖర్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు చంపుతామని బెదిరిస్తున్నారు..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక మైలాపూరు మాజీ శాసనసభ్యుడు, రంగస్థల, సినీ నటుడు ఎస్వీ శేఖర్‌(Film actor SV Shekhar)కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి నానా దుర్భాషలాడాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఆపకుంటే చంపుతామని బెదిరించాడు. ఈ విషయమై ఎస్వీ శేఖర్‌ మైలాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 22న తన సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేసిన వ్యక్తి ఏక వచనంతో సంబోధిస్తూ నానా దుర్భాషలాడాడని ఫోన్‌ కట్‌ చేసినా మళ్ళీ చేసి ఆ వ్యక్తి చంపుతానంటూ బెదిరించాడని ఎస్వీ శేఖర్‌ పేర్కొన్నారు. హిందుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారనే కారణంగా ఇదివరకే తన నివాసగృహంపై రెండు సార్లు పెట్రోలు బాంబు దాడులు కూడా జరిగాయని, ఈ నేపథ్యంలో ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిని గుర్తించి శిక్షించాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-05-28T11:45:46+05:30 IST