Russia Crime: వీడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. టీనేజ్ అమ్మాయిని ఎత్తుకెళ్లి.. 14 ఏళ్లు బంధించి..

ABN , First Publish Date - 2023-08-02T22:22:53+05:30 IST

వీడు మనిషి కాదు, నరరూప రాక్షసుడు. ఓ టీనేజ్ అమ్మాయిని ఎత్తుకెళ్లి, ఇంట్లోనే బంధించి, ఆమెపై 14 సంవత్సరాల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి కాదు కదా, కనీసం బెడ్రూంలో నుంచి బయటకు అడుగుపెట్టే అవకాశం కూడా ఇవ్వకుండా.. ఆమెకు నరకయాతన చూపించాడు..

Russia Crime: వీడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. టీనేజ్ అమ్మాయిని ఎత్తుకెళ్లి.. 14 ఏళ్లు బంధించి..

వీడు మనిషి కాదు, నరరూప రాక్షసుడు. ఓ టీనేజ్ అమ్మాయిని ఎత్తుకెళ్లి, ఇంట్లోనే బంధించి, ఆమెపై 14 సంవత్సరాల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి కాదు కదా, కనీసం బెడ్రూంలో నుంచి బయటకు అడుగుపెట్టే అవకాశం కూడా ఇవ్వకుండా.. ఆమెకు నరకయాతన చూపించాడు. చివరికి ఎలాగోలా ఆమె తప్పించుకొని బయటకు రావడంతో.. అతని బాగోతం బట్టబయలైంది. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

వెస్టర్న్ రష్యాలో నివాసముంటున్న వ్లాదిమిర్ చెస్కిడోవ్ (51) అనే వ్యక్తి.. 2009లో ఎకటరీనా అనే టీనేజ్ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. ఇక అప్పటి నుంచి ఆమెపై 14 సంవత్సరాల పాటు అత్యాచారం చేశాడు. మొదట్లో ఈ రాక్షసుడి బారి నుంచి తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించింది కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. మరోసారి ఆమె పారిపోయే ప్రయత్నం చేయకుండా.. ఒక రూంలో బంధించేశాడు. కత్తితో బెదిరిస్తూ.. ఇంట్లో పనులు చేయించుకునేవాడు. పనులు ముగియగానే, తిరిగి ఆమెను రూంలో బంధించేవాడు. దీంతో.. ఆమెకు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది.


అయితే.. ఎకటరీనా పరిస్థితి చూసి చలించిపోయిన వ్లాదిమిర్ తల్లి, ఆమెను తన కొడుకు చెర నుంచి విడిపించడంలో సహాయం చేసింది. ఆమె సహకారంతో ఆ నరకం నుంచి ఎకటరీనా బయటపడింది. ఇప్పుడు ఆమె వయసు 33 సంవత్సరాలు. బయటకొచ్చిన వెంటనే ఎకటరీనా పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ కామాంధుడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వెంటనే అతడ్ని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా.. వ్లాదిమిర్ 2011లో ఒక మహిళను హత్య చేసినట్లు తేలింది. అతడు నివాసముంటున్న ఇంట్లో నుంచి పోలీసులు బూతు టాయ్స్, పోర్నోగ్రఫీ సీడీలను స్వాధీన పరచుకున్నారు.

పోలీసులకు ఎకటరీనా ఇచ్చిన ఫిర్యాదులో.. డ్రింక్ తాగేందుకు వ్లాదిమిర్ తన ఇంటికి ఆహ్వానించాడని, అలా వెళ్లిన తనని అతడు బంధీ చేసి 14 ఏళ్లుగా టార్చర్ పెట్టాడని తెలిపింది. తనపై వెయ్యిసార్లకు పైగా అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. చిన్న చిన్న తప్పులు చేసినా.. తనని చిత్రహింసలకు గురి చేసేవాడని చెప్పింది. 2011లో వ్లాదిమిర్ ఇంటికి ఒక మహిళని తీసుకొచ్చాడని, ఆమె గొడవపడటంతో చంపేశాడని వెల్లడించింది. కాగా.. వ్లాదిమిర్ మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో, అతడు పోలీసుల పర్యవేక్షణలో ఒక మెంటల్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నాడు.

Updated Date - 2023-08-02T22:22:53+05:30 IST