Share News

Hyderabad: హోటల్‌కు తీసుకెళ్లి.. బాలికపై లైంగిక దాడి

ABN , First Publish Date - 2023-11-18T08:52:03+05:30 IST

బాలికను హోటల్‌కు తీసుకెళ్లిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు యువకులతో పాటు..

Hyderabad: హోటల్‌కు తీసుకెళ్లి.. బాలికపై లైంగిక దాడి

- గది అద్దెకిచ్చిన హోటల్‌ యజమాని, రిసెప్షనిస్టు సహా.. నలుగురి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): బాలికను హోటల్‌కు తీసుకెళ్లిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు యువకులతో పాటు.. హోటల్‌ యజమానిని, రిసెప్షనిస్టును అరెస్ట్‌ చేశారు. సౌత్‌వెస్ట్ జోన్‌ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక (15)తో పరిచయం ఉన్న యువకుడు స్నేహితుడి సహకారంతో ఆమెను హోటల్‌ రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ రిసెప్షనిస్టు/మేనేజర్‌ జాన్‌ సింగ్‌ అనుమానంతో యజమాని విజయ్‌కి విషయం చెప్పాడు. పెద్దగా పట్టించుకోని విజయ్‌ రూమ్‌ అద్దెకు ఇవ్వమని చెప్పాడు. దాంతో ఐడీ ప్రూఫ్స్‌ అడగకుండానే జాన్‌ సింగ్‌ వారికి రూమ్‌ ఇచ్చాడు. బాలికను గదిలోకి తీసుకెళ్లిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం స్నేహితుడి సహకారంతో ఆమెను ఇంటి వద్ద దిగబెట్టాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలికను తీసుకెళ్లిన యువకుడితో పాటు, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని, హోటల్‌ రిసెప్షనిస్టు/మేనేజర్‌ను, యజమానిని అరెస్ట్‌ చేశారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-11-18T08:52:05+05:30 IST