Share News

HYD: హబీబ్‌నగర్‌లో రౌడీషీటర్‌ దందాలు? సుపారీ ఇచ్చిన వ్యక్తినే బెదిరించిన వైనం

ABN , First Publish Date - 2023-10-27T10:38:15+05:30 IST

తన సోదరుడిని హతమార్చిన వారిని హత్య చేసేందుకు రౌడీషిటర్‌ను సంప్రదించిన ఓ వ్యక్తికి చివరకు అదే రౌడీషీటర్‌

HYD: హబీబ్‌నగర్‌లో రౌడీషీటర్‌ దందాలు? సుపారీ ఇచ్చిన వ్యక్తినే బెదిరించిన వైనం

మంగళ్‌హాట్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): తన సోదరుడిని హతమార్చిన వారిని హత్య చేసేందుకు రౌడీషిటర్‌ను సంప్రదించిన ఓ వ్యక్తికి చివరకు అదే రౌడీషీటర్‌ నుంచి తప్పించుకునేందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. హబీబ్‌నగర్‌ పోలీసులు... తెలిపిన వివరాల ప్రకారం... గుడిమల్కాపూర్‌ ప్రాంతానికి చెందిన వానరాసి యాదగిరి సోదరుడు వానరాసి రాజు 2016లో గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి సోదరుని హత్య చేసిన వారిపై పగతో ఉన్న వానరాసి యాదగిరి వారిని హతమార్చేందుకు హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో రౌడీషీటర్‌ మహ్మద్‌ కైసర్‌ అలియాస్‌ చోర్‌ కైసర్‌ను సంప్రదించాడు. రూ. 2లక్షలు సుపారీగా ఇచ్చి ప్రత్యర్థుల ఫొటోలను పంపించి వారిని హత్య చేయాలని చెప్పగా అందుకు రౌడీషీటర్‌ సరేనన్నాడు. అనంతరం రూ. 2 లక్షల నగదు కూడా రౌడీషీటర్‌కు ముట్టజెప్పాడు. వానరాసి యాదగిరి చెప్పిన పని రౌడీషీటర్‌ చేయకపోవడంతో డబ్బులు తిరిగి చెల్లించాలని కోరాడు. దీంతో రౌండీషీటర్‌ చోర్‌ కైసర్‌ మాత్రం యాదగిరిపై తిరగబడి రూ. 4 లక్షలు ఇవ్వకుండే చంపుతానని బెదింరించడంతో బయపడిపోయిన ఆయన రూ. 2 లక్షలు ఒకసారి, రూ.1.50 లక్షల మరో సారి ఇచ్చాడు. అయినా కైసర్‌ బెదిరింపులు ఆగకపోవడంతో రూ. 20వేలు, రూ. 15 వేలు, 15 వేల ఇలా మూడు దఫాలుగా ఇచ్చాడు. అయినా ఇబ్బందులు తప్పకపోవడంతో చివరకు హబీబ్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు బాదితుడు. కేసు నమోదు చేసుకున్న హబీబ్‌నగర్‌ పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించగా చోర్‌ కైసర్‌పై అనేక బెదింపు కేసులతో పాటు హత్యకేసు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు రూ. 100 కోట్ల వరకు ఆస్తులను కూడబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో రౌడీషీటర్‌ను జైలుకు పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-27T10:38:15+05:30 IST