Gold: విమానాశ్రయంలో రెండు కిలోల బంగారం స్వాధీనం
ABN , First Publish Date - 2023-11-19T13:52:36+05:30 IST
బెంగళూరు దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.1.25 కోట్ల విలువ చేసే 2 కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుంచి ఒమన్ ఎయిర్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతను బెల్ట్, హ్యాండ్‌బ్యాగ్‌లో బంగారాన్ని తెచ్చిన ట్లు గుర్తించారు. ఇతడి నుంచి ఒక కిలోకుపైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బ్యాంకాక్ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు, కొలంబో(Kolombo) నుంచి వచ్చిన ఒక మహిళ నుంచి కిలోకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్టు తేలిందని కస్టమ్స్ అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.