ఉద్యోగం పేరుతో రూ.1.14 కోట్ల మోసం.. ఇదెక్కడ జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-15T11:43:32+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగాలు తీసిస్తానంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం చేసి పదిమంది వద్ద రూ.1.14 కోట్ల మోసం చేసిన వ్యక్తిని చెన్నై పోలీ

ఉద్యోగం పేరుతో రూ.1.14 కోట్ల మోసం.. ఇదెక్కడ జరిగిందో తెలిస్తే..

అడయార్‌(చెన్నై): ప్రభుత్వ ఉద్యోగాలు తీసిస్తానంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం చేసి పదిమంది వద్ద రూ.1.14 కోట్ల మోసం చేసిన వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఆదంబాక్కంకు చెందిన కార్తికేయన్‌... మణలిలో ఒక ట్రావెల్‌ ఏజెన్సీని నడుపుతున్నాడు. ఈయన ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం చేశాడు. దీంతో ఉద్యోగ వేటలో ఉండే పది మంది నిరుద్యోలు కార్తికేయన్‌(Karthikeyan)ను సంప్రదించి రూ.1.14 కోట్లు చెల్లించారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఆయన ముఖం చాటేశాడు. దీనిపై రామనాథపురం(Ramanathapuram) జిల్లాకు చెందిన రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆవడి నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ రాయ్‌ రాథోడ్‌ ఆదేశం మేరకు విచారణ చేపట్టారు. ఈ విచారణలో కార్తికేయ మోసం చేసినట్టు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-15T11:43:32+05:30 IST