Former MLA: మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కాల్పులు

ABN , First Publish Date - 2023-09-10T10:15:09+05:30 IST

కడలూరు జిల్లా విరుదాచలంలో పాతకక్షల కారణంగా డీఎంకే మాజీ ఎమ్మెల్యే త్యాగరాజన్‌(Former DMK MLA Thyagarajan) కుమారుడు

Former MLA: మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కాల్పులు

- ఆరుగురి అరెస్ట్‌, రెండు తుపాకుల స్వాధీనం

ప్యారీస్‌(చెన్నై): కడలూరు జిల్లా విరుదాచలంలో పాతకక్షల కారణంగా డీఎంకే మాజీ ఎమ్మెల్యే త్యాగరాజన్‌(Former DMK MLA Thyagarajan) కుమారుడు ఇళయరాజా(Ilayaraja)పై తుపాకీతో కాల్పులు జరిపిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి, రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. విరుదాచలం మనవాల నల్లూర్‌ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం సాగిస్తున్న ఇళయరాజా ఆదివారం ఈ అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సమావేశం నిర్వహించే ప్రాంతానికి మూడు మోటరు సైకిళ్లపై వెళ్లిన ఆరుగురు వ్యక్తులు రెప్పపాటులో అక్కడున్న ఇళయరాజాపై తమ వెంట తీసుకెళ్లిన రెండు తుపాకులతో కాల్పులు జరిపారు. ఇందులో గాయపడిన ఇళయరాజా అక్కడి నుంచి తప్పించుకొని తన కారులో విరుదాచలం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు ఆయనకు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్సలు కొనసాగిస్తున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే త్యాగరాజన్‌ అందజేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. కాల్పులు జరపడానికి కారణం పాతకక్షలే కారణమని ప్రాథమిక విచారణలో తెలిసింది.

Updated Date - 2023-09-10T10:15:11+05:30 IST