Former MLA: మాజీ ఎమ్మెల్యేపై కాల్పుల కేసు... నలుగురి అరెస్టు
ABN , First Publish Date - 2023-09-24T09:27:31+05:30 IST
కడలూరు జిల్లా విరుదాచలం రామచంద్రన్‌పేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఇళయరాజన్ (46)పై కాల్పుల కేసులో నలుగురిని
- ఐదు తుపాకుల స్వాధీనం
అడయార్(చెన్నై): కడలూరు జిల్లా విరుదాచలం రామచంద్రన్‌పేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఇళయరాజన్ (46)పై కాల్పుల కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈయన విరుదాచలంలో ఒక వృద్ధాశ్రమంలో బాలల సంక్షేమ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇదే ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్ వర్గానికి చెందిన నేత పుగళేంది రాజా (27)తో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈనెల 8న పుగళేంది రాజా, అతని సోదరుడు అడలరసు తన అనుచరులతో ఇళయరాజాపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇళయరాజా... చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి... అడలరసు, పుగళేంది రాజా సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. అలాగే, ఈ కాల్పుల కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురిని శనివారం అరెస్టు చేశారు.