Female SI: ఈ రౌడీ మామూలోడు కాదు.. ఓ మహిళా ఎస్‌ఐపై...
ABN , First Publish Date - 2023-11-18T11:48:28+05:30 IST
స్థానిక చూలైలో మద్యం మత్తులో ఓ రౌడీ మహిళా ఎస్‌ఐ(Female SI)పై అరాచకాలకు పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- మహిళా ఎస్‌ఐపై రౌడీ అరాచకం
- వైరల్ అవుతున్న వీడియో
పెరంబూర్(చెన్నై): స్థానిక చూలైలో మద్యం మత్తులో ఓ రౌడీ మహిళా ఎస్‌ఐ(Female SI)పై అరాచకాలకు పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెప్పేరి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న గౌరి గురువారం రాత్రి చూలై కురువన్ ప్రాంతంలో గస్తీ పనులు చేపట్టారు. ఆ సమయంలో ‘బి’ కేటగిరీ రౌడీగా ఉన్న కిషోర్ అలియాస్ కాల్వాయ్ కిషోర్(Kishore alias Kalvai Kishore) మద్యం మత్తులో స్నేహితులతో కలసి ఆ ప్రాంతంలో గలాటా చేస్తుండగా ఎస్‌ఐ అడ్డుకున్నారు. దీంతో అతను ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ‘నేనిలా చేస్తా... ఏం చేస్తారు? అంటూ కిషోర్ బిగ్గరగా కేకలు వేసే దృశ్యాలను ఆ ప్రాంతంలోని కొందరు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వెలువరించారు. దీంతో వెప్పేరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కిషోర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా, అతను మద్యం మత్తులో ఉండడంతో హెచ్చరించి పంపారు. శుక్రవారం ఉదయం అతనిని విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.