Dharmapuri: ఆలయ జాతరలో అపశృతి.. బాణసంచా పేలి..
ABN , First Publish Date - 2023-05-25T12:24:51+05:30 IST
ధర్మపురి జిల్లా మోరప్పూర్ సమీపంలో వున్న పళ్లిపట్టిలో జరిగిన మారియమ్మన్ ఆలయ జాతరలో బాణసంచా పేలి ఇద్దరు దుర్మరణం చెం

ప్యారీస్(చెన్నై): ధర్మపురి జిల్లా మోరప్పూర్ సమీపంలో వున్న పళ్లిపట్టిలో జరిగిన మారియమ్మన్ ఆలయ జాతరలో బాణసంచా పేలి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై వీధుల్లో ఊరేగించారు. ఈ వాహనాన్ని అదే గ్రామానికి చెందిన రాఘవేంద్రన్(26) నడిపాడు. ఊరేగింపులో పేల్చేందుకు బాణసంచాను అదే వాహనంలో పెట్టారు. ఈ నేపథ్యంలో ఓ టపాసు పేలి నిప్పు రవ్వలు ఆ వాహనంపై పడ్డాయి. దాంతో అందులో వున్న బాణసంచా అంతా పేలిపోయింది. దాంతో రాఘవేంద్రన్, సమీపంలోనే వున్న ఆకాష్ అక్కడికక్కడే మృతి చెందారు.