Chennai: వివాహేతర సంబంధానికి నిండు ప్రాణం బలి.. అసలేం జరిగిందో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-03-15T10:40:45+05:30 IST
భార్యను హతమార్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్టు చేశారు. రాణిపేట(Ranipet) జిల్లా ఆర్కాడు సమీపం తోపుఖానాకు చెందిన ఎలక్ట్రీషియన్ చేటు, భాను

వేలూరు(చెన్నై): భార్యను హతమార్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్టు చేశారు. రాణిపేట(Ranipet) జిల్లా ఆర్కాడు సమీపం తోపుఖానాకు చెందిన ఎలక్ట్రీషియన్ చేటు, భానుమతి (32)లకు ఇద్దరు కుమారులున్నారు. చేటుకు అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో, భానుమతి(Bhanumati) గత వారం గర్భసంచి తొలగించే ఆపరేషన్ చేయించుకుంది. ఈ నెల 13వ తేది మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. ఆవేశం చెందిన చేటు భార్య గొంతు నులిమి హతమార్చాడు. చుట్టుపక్కల వారికి ఆపరేషన్ చేయించుకున్న కారణంగా ఆమె మృతిచెందిందని తెలిపారు. చేటు వ్యవహారాన్ని అనుమానించిన భానుమతి బంధువుల ఫిర్యాదుతో ఆర్కాడు పోలీసులు చేటును అదుపులోకి తీసుకొని విచారించారు. హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచి వేలూరు జైలుకు తరలించారు.