అయ్యోపాపం.. ఎంత ఘోరం జరిగింది.. ఈతకు వెళ్లిన అన్నా చెల్లెలు..

ABN , First Publish Date - 2023-05-27T08:57:16+05:30 IST

సరదగా ఈత నేర్చుకుంటున్న అన్నా, చెల్లెలు మృతిచెందిన ఘటన విషాదాని కి దారితీసింది. పేయంపేటకు చెందిన శక్తివేల్‌

అయ్యోపాపం.. ఎంత ఘోరం జరిగింది.. ఈతకు వెళ్లిన అన్నా చెల్లెలు..

పెరంబూర్‌(చెన్నై): విరుదునగర్‌ జిల్లా రాజపాళయం సమీపంలో సరదగా ఈత నేర్చుకుంటున్న అన్నా, చెల్లెలు మృతిచెందిన ఘటన విషాదాని కి దారితీసింది. పేయంపేటకు చెందిన శక్తివేల్‌ కుమారుడు మోగుల్‌ (8), కుమార్తె వర్షణ (6) అదే ప్రాంతంలోని చెరువులో శుక్రవారం సాయంత్రం ఈత నేర్చుకుంటున్న సమయంలో ఊహించని విధంగా నీట మునిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని చెరువులో గాలించి మృతదేహాలు వెలికితీశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. కాగా ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2023-05-27T08:57:16+05:30 IST