అయ్యోపాపం.. ఎంతదారుణం.., కన్నతల్లి అనే కనికరం కూడా లేకుండా...

ABN , First Publish Date - 2023-03-16T10:48:12+05:30 IST

తల్లిన హతమార్చిన కుమారుడు కటకటాలపాలయ్యాడు. రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపం చక్రమల్లూరుకు చెందిన వాణీశ్వరి(52), రాహులన్‌ దం

అయ్యోపాపం.. ఎంతదారుణం.., కన్నతల్లి అనే కనికరం కూడా లేకుండా...

వేలూరు(చెన్నై): తల్లిన హతమార్చిన కుమారుడు కటకటాలపాలయ్యాడు. రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపం చక్రమల్లూరుకు చెందిన వాణీశ్వరి(52), రాహులన్‌ దంపతులకు రాజేష్‌, దినేష్‌(Rajesh, Dinesh) అనే కుమారులు, ప్రియ అనే కుమార్తె ఉంది. పెద్ద కుమారుడు రాజేష్‌ వేలూరు సత్తువాచేరిలోను, రెండో కుమారుడు దినేష్‌ వేలూరు పోలీసులుగా పని చేస్తున్నారు. రాహులన్‌ 20 ఏళ్ల క్రితం మృతిచెందాడు. రెండో కుమారుడు దినేష్‌ (33) మద్యానికి బానిసై విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతో గత ఏడాది నవంబరులో డిస్మిస్‌ గురయ్యాడు. దీంతో ఆయన భార్య ప్లాజా భర్తను వదిలి సిప్కాట్‌లోని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. దినేష్‌ తన తల్లితో కలసి చక్రనల్లూరులో ఉంటున్నాడు. రోజూ మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లిని వేధించేవాడు. ఈ నెల 13వ తేది డబ్బులు ఇవ్వనని చెప్పడంతో తల్లి తలపై దినేష్‌ కర్రతో కొట్టాడు. దీంతో తలకు తీవ్రగాయమైన ఆమె సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. దీంతో ఇంటికి తలుపులకు తాళాలు వేసిన దినేష్‌(Dinesh) ఓ గదిలో తాగుతూ కూర్చున్నాడు. చాలాసేపటి వరకు ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకొని తలుపులు ధ్వంసం చేసి లోపలికి వెళ్లగా, రక్తపుమడుగులో వాణీశ్వరి మృతిచెంది ఉండడం, పక్క గదిలో దినేష్‌ తాగుతుండడం గమనించాడు. పోలీసులకు గమనించిన దినేష్‌ వారిపై దాడిచేసి తప్పించుకు పారిపోయాడు. కుమార్తె ప్రియ ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు రాణిపేటలో ఉన్న దినేష్‏ను బుధవారం ఉదయం అరెస్టు చేశారు.

Updated Date - 2023-03-16T10:48:12+05:30 IST