అయ్యోపాపం.. వీరికి ఎంత కష్టమొచ్చిందో...

ABN , First Publish Date - 2023-03-15T11:30:41+05:30 IST

పిల్లలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, ఈ దారుణాన్ని తట్టుకోలేని మహిళ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నామక్కల్‌

అయ్యోపాపం.. వీరికి ఎంత కష్టమొచ్చిందో...

వేళచ్చేరి(చెన్నై): పిల్లలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, ఈ దారుణాన్ని తట్టుకోలేని మహిళ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నామక్కల్‌ జిల్లా మోగనూరు ప్రాంతానికి చెందిన కేశవన్‌(70) కుమార్తె గుణవతి, గోపి దంపతులకు ప్రణవ్‌ ప్రియన్‌ (5), సుజిత్‌ ప్రియన్‌ (17 నెలలు) అనే కుమారులున్నారు. సోమవారం రాత్రి పిల్లలిదర్నీ గుణవతి దండిస్తుండడాన్ని గమనించిన గోపి, ఆమెను తీవ్రంగా మందలించాడు. దీంతో, అర్ధరాత్రి ఆమె పిల్లలను సమీపంలోని బావిలో తోసి, బావి పక్కనే ఉన్న చెట్టుకు ఉరేసుకుంది. మృతదేహాలను చూసిన కేశవన్‌ ఆత్యాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేశవన్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-03-15T11:30:41+05:30 IST