కూరగాయలు ఇవ్వడానికి పక్కింటికి వెళ్లిన పదేళ్ల బాలిక.. తిరిగి వచ్చిన కూతురిని చూసి తల్లికి అనుమానం.. ఏం జరిగిందని అడిగితే..

ABN , First Publish Date - 2023-02-28T20:58:41+05:30 IST

ఆ బాలిక వయసు పదేళ్లు.. ఐదో తరగతి చదువుతోంది.. సోమవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న ఆ పాపకు తల్లి కూరగాయల సంచి ఇచ్చి పక్కింటి ఆంటీకి ఇవ్వమని చెప్పింది.. వెళ్లిన గంట తర్వాత ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది..

కూరగాయలు ఇవ్వడానికి పక్కింటికి వెళ్లిన పదేళ్ల బాలిక.. తిరిగి వచ్చిన కూతురిని చూసి తల్లికి అనుమానం.. ఏం జరిగిందని అడిగితే..

ఆ బాలిక వయసు పదేళ్లు.. ఐదో తరగతి చదువుతోంది.. సోమవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న ఆ పాపకు తల్లి కూరగాయల సంచి ఇచ్చి పక్కింటి ఆంటీకి ఇవ్వమని చెప్పింది.. వెళ్లిన గంట తర్వాత ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది.. ఆమె మొహం, శరీరం చూసి తల్లి ఏదో కీడు శంకించింది.. ఏం జరిగిందని అడిగితే ఆ బాలిక వెక్కి వెక్కి ఏడుస్తూ నిజం చెప్పింది.. షాకైన తల్లి వెంటనే ఆ బాలికను హాస్పిటల్‌కు తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది (Crime News).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మెయిన్‌పురికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక (Minor Girl) సోమవారం సాయంత్రం తన పక్కింటికి వెళ్లింది. ఆ సమయంలో ఆ ఇంట్లో 32 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పాపకు చాక్లెట్ ఇచ్చి అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ఆ పాప నిరాకరించడంతో మొబైల్‌లో గేమ్ ఆడదామని చెప్పాడు. మొబైల్‌లో ఓ వీడియో చూపిస్తానని, అందులో ఉన్న వాళ్లు ఏం చేస్తే మనమూ అదే చేయాలని చెప్పి పోర్న్ వీడియో పెట్టాడు. అమాయకమైన బాలిక ఆ మృగాడు చెప్పినట్టు చేసింది. ఆ తర్వాత ఆ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు (Sexual Harassment). అనంతరం బాలికను వదలిపెట్టాడు.

Shocking Video: బాబోయ్.. ఆ పెళ్లి చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే.. కట్నంగా వధువు బరువుకు సమానమైన గోల్డ్‌.. నిజమేంటంటే..

నీరసమైన మొహంతో, అస్తవ్యస్తమైన బట్టలతో వస్తున్న కూతురిని చూసి తల్లి షాకైంది. ఏదో జరిగిందని గ్రహించి కూతురిని ప్రశ్నించింది. కూతురు వెక్కి వెక్కి ఏడుస్తూ తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది. వెంటనే ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి గురించి గాలిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

Updated Date - 2023-02-28T20:58:41+05:30 IST