Wonderla: ఏప్రిల్‌లో పుట్టారా?.. అయితే మీ కోసమే ఈ ఆఫర్!

ABN , First Publish Date - 2023-04-09T21:18:48+05:30 IST

దేశంలోని ప్రముఖ అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ వండర్‌లా(Wonderla) హైదరాబాద్ పార్క్ ఏడో

Wonderla: ఏప్రిల్‌లో పుట్టారా?.. అయితే మీ కోసమే ఈ ఆఫర్!

హైదరాబాద్: దేశంలోని ప్రముఖ అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ వండర్‌లా(Wonderla) హైదరాబాద్ పార్క్ ఏడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ నెలలో పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్శకుల కోసం వన్‌ ప్లస్ వన్ ఆఫర్‌ను ప్రకటించింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పార్కును సందర్శించి ఈ ఆఫర్ పొందొచ్చు. ఈ నెల 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ఏడేళ్లు పూర్తి చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని వండర్‌లా హాలీడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలాపిళ్లి అన్నారు. తమపై అమితమైన ప్రేమ చూపుతున్న తమ సందర్శకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు. 2016లో హైదరాబాద్‌లో ప్రారంభమైన వండర్‌లా వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇందులో మొత్తం 46 థ్రిల్లింగ్ రైడ్స్ ఉన్నాయి. అన్ని వయసుల వారినీ ఇది ఆకర్షిస్తోంది.

వేసవి సీజన్ ప్రారంభం కావడంతో వండర్‌లా ఇప్పుడు పార్క్ వద్ద సమ్మర్ ఫియస్తాను ప్రకటించింది. ఈ నెల 14 నుంచి జూన్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫియస్టాలో థ్రిల్లింగ్‌ రైడ్స్‌, ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్రత్యేక షోస్‌ సహా మరెన్నో ఉంటాయి.

Updated Date - 2023-04-09T21:18:48+05:30 IST