Lay Off: అమెరికన్ 3ఎం కంపెనీలోనూ 6వేల ఉద్యోగాల కోత

ABN , First Publish Date - 2023-04-26T12:06:49+05:30 IST

అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీ 3 ఎం మరో విడత లే ఆఫ్ ప్రకటించింది...

Lay Off: అమెరికన్ 3ఎం కంపెనీలోనూ 6వేల ఉద్యోగాల కోత
US Industrial Company Lay Off

వాషింగ్టన్ : అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీ 3 ఎం మరో విడత లే ఆఫ్ ప్రకటించింది.(Lay Off) ఎలక్ట్రానిక్ వస్తువుల డిమాండ్ తగ్గిన నేపథ్యంలో కంపెనీలో ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా(People Worldwide) ఉత్పత్తి, సేల్స్ విభాగాల్లో ఉద్యోగాల కోత విధించాలని 3ఎం కంపెనీ నిర్ణయించింది.(American multinational corporation)మైనింగ్ ఉత్పత్తి కంపెనీలో ఆరువేల మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. మంచి డిమాండ్ ఉన్న ఆటోమోటివ్ ఎలక్ట్రిఫికేషన్, హోం ఇంప్రూవ్ మెంట్ విభాగాలపై కంపెనీ దృష్టి సారించాలని నిర్ణయింది. ఇటీవల కంపెనీ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో 35 శాతం విక్రయాలు తగ్గాయని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోనిష్ పటోలావాలా చెప్పారు. పెరిగిన వడ్డీ రేట్లు, తగ్గిన డిమాండ్ వల్ల కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్నాయి.

Updated Date - 2023-04-26T12:06:49+05:30 IST