Share News

Tata Tech IPO: దుమ్ము రేపిన టాటా టెక్నాలజీస్.. 140 శాతం లాభంతో బంపర్ లిస్టింగ్..!

ABN , First Publish Date - 2023-11-30T11:31:34+05:30 IST

టాటా గ్రూప్ నుంచి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఐపీఓకు వచ్చిన టాటా టెక్నాలజీస్‌కు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఊహించినట్టుగానే స్టాక్ మార్కెట్లో ఈ రోజు (గురువారం) బంపర్ లిస్టింగ్ నమోదు చేసింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 140 శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌కు వచ్చింది.

Tata Tech IPO: దుమ్ము రేపిన టాటా టెక్నాలజీస్.. 140 శాతం లాభంతో బంపర్ లిస్టింగ్..!

టాటా (Tata) గ్రూప్ నుంచి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఐపీఓకు వచ్చిన టాటా టెక్నాలజీస్‌కు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది (TaTa Tech IPO). ఊహించినట్టుగానే స్టాక్ మార్కెట్లో ఈ రోజు (గురువారం) బంపర్ లిస్టింగ్ నమోదు చేసింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 140 శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌కు వచ్చింది. రూ.3042 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఐపీఓకు వచ్చిన టాటా టెక్ ఇష్యూ ధర రూ.500. మొత్తం 4.5 కోట్ల షేర్లను సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా చివరి రోజు పూర్తయ్యే సరికి 69.4 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్ అయింది (TaTa Tech Listing).

ఈ రోజు బీఎస్‌లో (BSE) టాటా టెక్ షేర్ రూ.1200 వద్ద లిస్ట్ అయింది. అంటే ఐపీఓలో షేర్లు అలాట్ అయిన వారు ఒక్కో లాట్ (30 షేర్ల)పై ఏకంగా రూ.21 వేల లాభాన్ని ఆర్జించారు. రూ.1200 వద్ద లిస్ట్ అయిన టాటా టెక్ రూ.1400 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం కాస్త కిందకు దిగి వచ్చి ఉదయం 11:23 గంటల సమయంలో రూ. 1317 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా టెక్ సంస్థకు వివిధ దేశాలో 18 డెలివరీ కేంద్రాలున్నాయి. దాదాపు 11 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సహా టాటా గ్రూపులోని పలు సంస్థలకు టాటా టెక్ సంస్థ సేవలందిస్తోంది. ఇంజినీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్, డిజిటల్ ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్, వాల్యూ యాడెడ్ రీసెల్లింగ్ అండ్ సర్వీసెస్ విభాగాల్లో టాటా టెక్ పని చేస్తుంటుంది.

Updated Date - 2023-11-30T11:32:59+05:30 IST