RuPay Prepaid Forex Cards: విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త..

ABN , First Publish Date - 2023-06-09T22:12:49+05:30 IST

విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త. చెల్లింపుల ఎంపిక విస్తరణలో భాగంగా రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీకి భారతీయ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

RuPay Prepaid Forex Cards: విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త..

ముంబై: విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త. చెల్లింపుల ఎంపిక విస్తరణలో భాగంగా రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీకి భారతీయ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్‌లను అన్ని విదేశీ ATMలు, PoS మెషీన్లు(Pos M achines), ఆన్‌లైన్ వ్యాపారుల(Online Merchants) వద్ద వినియోగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

భారత్‌లోని బ్యాంకులు జారీ చేస్తున్న రూపే క్రెడిట్, డెబిట్ కార్డులకు విదేశాల్లో ఆమోదం పెరుగుతోందని ఆర్బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. బ్యాంకులు రూపే ప్రిపెయడ్ ఫారెక్స్ కార్డులను జారీకి కూడా అనుమతిస్తున్నామన్నారు. దీంతో రూపే కార్డుల విస్తృతి అంతర్జాతీయంగా మరింత పెరుగుతుందన్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీలో మార్పులను ప్రకటిస్తున్న సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

ఈ రూపే ప్రీ-పెయిడ్ ఫారెక్స్ కార్డుల ద్వారా విదేశాల్లోని ఆన్‌లైన్ మర్చంట్స్, ఏటీఎంలు, పీఓఎస్ మెషిన్స్ వద్ద సులభంగా లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో రూపే కార్డులను ప్రమోట్ చేయడంతో పాటు విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు మరిన్ని చెల్లింపు ఆప్షన్లను అందించనుంది.

ఈ ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక Monetary Policy విడుదల చేసిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్.. రూపే డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డ్‌లు విదేశీ అధికార పరిధిలో జారీ చేయనున్నట్లు తెలిపారు. వీటిని భారత్‌సహా అన్ని దేశాల్లో వినియోగించు కోవచ్చని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఈ మేరకు డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై ఓ ప్రకటన విడుదల చేశారు.

భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) అనేది 'ఎనీటైమ్ ఎవ్రీ వేర్' బిల్లు చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ అని.. ఇది ఆగస్టు 2017 నుంచి పనిచేస్తుందని కూడా శక్తికాంత్ దాస్ చెప్పారు. ప్రస్తుతం..BBPS 20,500 బిల్లర్లను ఆన్‌బోర్డ్ చేసిందని.. ప్రతి నెలా 9.8 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. 2022 డిసెంబర్‌లో BBPS పరిధిని మరింత విస్తరించారు. అన్నిరకాల పేమెంట్లు, కలెక్షన్లను సులభతరం చేశారు. దీంతోపాటు విదేశాల్లో బిల్లు చెల్లింపులను కూడా విస్తరించామని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇందులో భాగంగానే రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్‌లను విదేశాల్లో చెల్లింపులకు అనుమతించాలని శక్తికాంత్ తెలిపారు.ముంబై: విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త. చెల్లింపుల ఎంపిక విస్తరణలో భాగంగా రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీ చేసే విధంగా భారతీయ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్‌లను అన్ని విదేశీ ATMలు, PoS మెషీన్లు(Pos M achines), ఆన్‌లైన్ వ్యాపారుల(Online Merchants) వద్ద వినియోగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2023-06-09T22:33:55+05:30 IST