Netflix: 30కి పైగా దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు తగ్గింపు

ABN , First Publish Date - 2023-02-24T16:13:07+05:30 IST

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Nteflix) 30కి పైగా దేశాల్లో సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. చందాదారులను ఆకట్టుకోవడానికి ఈజిప్టు, యెమెన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా, బల్గేరియా, నికరాగ్వ, ఈక్వెడార్, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఫీజును తగ్గించింది

Netflix:  30కి పైగా దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు తగ్గింపు

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Nteflix) 30కి పైగా దేశాల్లో సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. చందాదారులను ఆకట్టుకోవడానికి ఈజిప్టు, యెమెన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా, బల్గేరియా, నికరాగ్వ, ఈక్వెడార్, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఫీజును తగ్గించింది. ఇండియాలో గత కొంతకాలంగా ఓటీటీలు ఆదరణ పొందుతున్నప్పటికి మన దేశంలో మాత్రం ఛార్జీలను తగ్గించకపోవడం విచారకరమైన అంశం.

నెట్‌ఫ్లిక్స్ కొన్ని దేశాల్లో భారీ స్థాయిలో ఆదరణను కోల్పోతుంది. చందాదారులు భారీగా తగ్గిపోతుండటంతో సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా (సీఎస్ఏ), సబ్ సహారన్ ఆఫ్రికా (ఎస్‌ఎస్‌ఏ), మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా (ఏమ్ఈఎన్ఏ), సెంట్రల్ అండ్ ఈస్ట్రన్ యూరప్ (సీఈఈ), ఏసియా పసిఫిక్ (ఏపీఏసీ) తదితర రీజియన్స్‌లో భారీగా ఛార్జీలను తగ్గించింది. ఖాతాదారులను పెంచుకోవడానికి సబ్ స్క్రిఫ్షన్ ఫీజుపై దాదాపుగా 20శాతం నుంచి 60శాతం వరకు డిస్కౌంట్స్ ఇవ్వనుంది. అందుకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ మలేసియా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ప్రతి నెల నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌ను 28మలేసియన్ రింగిట్స్‌కే అందివ్వనున్నాం. ఈ ఆఫర్ ప్రస్తుత చందాదారులతో పాటు కొత్తగా చేరబోయే వారికి అందుబాటులో ఉంటుంది’’ అని ఆ సంస్థ చెప్పింది. గతంలో నెట్‌‌ఫ్లి‌క్స్ ప్లాన్ బేసిక్ ధర 35మలేసియన్ రింగిట్స్ మాత్రమే ఉండేది.

గతంలో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను లాటిన్ అమెరికాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు అక్కడ సక్సెస్ కావడంతో మరికొన్ని దేశాలకు విస్తరించింది. కెనడా, న్యూజిలాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో అమలు చేసింది. ప్రస్తుతం ఆ దేశంలోని చందాదారులకు పాస్‌వర్డ్ షేరింగ్ ఫీచర్‌ను తొలగించింది. అయినప్పటికీ, వారు తమ నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్ అకౌంట్‌ను మాత్రం ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ప్రస్తుత వినియోగదార్లు అకౌంట్‌ను బదిలీ చేస్తే వారి రికమండేషన్స్, హిస్టరీ, మై లిస్ట్, సేవ్డ్ గేమ్స్‌తో సహా మరికొన్ని కొత్త చందాదారులు వీక్షించే అవకాశం ఉంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-24T16:23:38+05:30 IST