Share News

Nokia Lay offs: నోకియా సంచలన నిర్ణయం.. ఏకంగా 14 వేల మంది ఉద్యోగులపై వేటు

ABN , First Publish Date - 2023-10-20T11:21:33+05:30 IST

ప్రముఖ టెలికం కంపెనీ నోకియా(Nokia కంపెనీ ఉద్యోగులను తొలగించింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలో ఉన్న ఉద్యోగులలో 14 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ రెడీ చేసినట్లు నోకియా సీఈవో పెక్కా లండ్‌మార్క్‌(Chief Executive Pekka Lundmark) ప్రకటించారు.

Nokia Lay offs: నోకియా సంచలన నిర్ణయం.. ఏకంగా 14 వేల మంది ఉద్యోగులపై వేటు

హెల్సింకి: ఐటీ రంగంలో(IT Industry) లే ఆఫ్ ల కాలం నడుస్తోంది. వందల సంఖ్యలో ఉద్యోగులను కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నాయి. దిగ్గజ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా స్మార్ట్ ఫోన్ తయారీలో సీనియర్ కంపెనీ ఒకటి ఏకంగా 14 వేల మందిపై వేటు వేసింది. ప్రముఖ టెలికం కంపెనీ నోకియా(Nokia కంపెనీ ఉద్యోగులను తొలగించింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలో ఉన్న ఉద్యోగులలో 14 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ రెడీ చేసినట్లు నోకియా సీఈవో పెక్కా లండ్‌మార్క్‌(Chief Executive Pekka Lundmark) ప్రకటించారు. 2023 మూడో త్రైమాసికంలో సంస్థ అమ్మకాలు, ప్రాఫిట్స్ తగ్గడంతో ఖర్చు తగ్గించుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. అందుకే ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నామన్నారు. 2026 నాటికి 86 వేల ఉద్యోగులను 72 వేల నుంచి 77 వేల వరకు తగ్గిస్తామని వెల్లడించారు. నాలుగో త్రైమాసికంలో కంపెనీ వృద్ధి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పెక్కా తెలిపారు.


మైక్రోసాఫ్ట్(Microsoft) ఆధీనంలోని లింక్డ్‌ఇన్ సైతం.. ఇంజినీరింగ్, ప్రొడక్ట్, టాలెంట్ తదితర డిపార్ట్ మెంట్ల నుంచి సుమారు 668 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలో కంపెనీ గ్రోత్ తగ్గడంతో మైక్రోసాఫ్ట్ మరోసారి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇవే కాదు పెద్ద సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు లేఆఫ్స్(Lay offs) ప్రకటిస్తున్నాయి. ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగాల కోత కొత్తేమీ కాదు. కానీ రెండేళ్లలో భారీగా ఉద్యోగాల కోతలు విధిస్తున్నాయి. సగటున ప్రతి గంటకు 23 మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగం కోల్పోతున్నట్లు లేఆఫ్ ఫీ వెబ్‌సైట్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ - రష్యా, ఇజ్రాయెల్ - పాలస్థీనా మధ్య యుద్ధాలు ఐటీ రంగంపై పెను ప్రభావాన్నే చూపుతున్నాయి.

Updated Date - 2023-10-20T11:22:41+05:30 IST