Share News

SIM Card Rules : కొత్త సిమ్ కార్డ్ తీసుకుంటున్నారా.. రూల్స్ మారాయ్.. ఓ లుక్కేయండి..

ABN , First Publish Date - 2023-12-01T13:20:32+05:30 IST

సిమ్ కార్డు నిబంధనలు(Sim Card rules) కఠినంగా మారాయి. డిసెంబర్ 1నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. మీరు కొత్త సిమ్ తీసుకోవాలనుకుంటే నిబంధనల్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి.

SIM Card Rules : కొత్త సిమ్ కార్డ్ తీసుకుంటున్నారా.. రూల్స్ మారాయ్.. ఓ లుక్కేయండి..

ఢిల్లీ: ఫోన్లు లేని జీవితాన్ని నేటి తరం ఊహించుకోలేదు. అయితే సెల్ ఫోన్ లో సిమ్ ఉండటమూ ముఖ్యమే. పెరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డు నిబంధనలను కఠినతరం చేస్తోంది. గతంలో ఇష్టానుసారంగా సిమ్ లను అమ్మేవారు. తాజాగా సిమ్ కార్డు నిబంధనలు(Sim Card rules) కఠినంగా మారాయి. డిసెంబర్ 1నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

మీరు కొత్త సిమ్ తీసుకోవాలనుకుంటే నిబంధనల్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. సిమ్ కార్డు అమ్మకాల్లో రక్షణ, భద్రత పెంచడం, నకిలీ సిమ్ కార్డు మోసాలు, సైబర్ నేరాలు అరికట్టేందుకు నిబంధనల్ని తెచ్చినట్లు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు కచ్చితంగా పాటించాలని.. ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది. తొలుత వీటిని ఈ ఏడాది అక్టోబర్ 1నుంచి అమలు చేయాలని భావించినా.. తరువాత 2 నెలలపాటు వాయిదా వేసి డిసెంబర్ 1నుంచి అమలు చేస్తున్నారు. ఇందులోని నిబంధనల ప్రకారం..


1. నమోదు ప్రక్రియ: కొత్త నిబంధనల ప్రకారం.. సిమ్ కార్డుల్ని విక్రయించే డీలర్లు ముందుగా దీని కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ బాధ్యత ఆయా టెలికాం ఆపరేటర్ పైనే ఉంటుంది. నిబంధనలు పాటించకపోతే రూ.10లక్షల జరిమానా విధిస్తారు.

2. కేవైసీ నియమాలు: సిమ్ కార్డు తీసుకున్న వ్యక్తి ఆధార్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అవసరమైన వివరాలు క్యాప్చర్ చేయబడతాయి. ముఖ్యంగా, మునుపటి వినియోగదారు డిస్‌కనెక్ట్ చేసిన 90 రోజుల తర్వాత మాత్రమే మొబైల్ నంబర్ కొత్త కస్టమర్‌కు కేటాయిస్తారు. SIM రీప్లేస్‌మెంట్ కోసం ఒక సబ్‌స్క్రైబర్ మొత్తం KYC ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని.. అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ SMS సౌకర్యాలపై 24 గంటల గడువు ఉంటుంది.

3. ఎక్కువ సిమ్‌లను కొనుగోలు చేయడం: డిజిటల్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం సిమ్ కార్డుల బల్క్ విక్రయాలను నిలిపేసింది. అయితే, వ్యాపారాలు, కార్పొరేట్‌లు లేదా ఈవెంట్‌ల కోసం కనెక్షన్‌లు లేదా సిమ్‌లు వ్యక్తిగత సిమ్ కార్డ్ యజమానులందరికీ మీ-కస్టమర్ లేదా KYC నిబంధనలు వర్తిస్తాయి. ఒక వ్యక్తి ఐడీపై గరిష్టంగా 9 సిమ్ కార్డుల్ని పొందేందుకు అర్హత ఉంటుంది. ఎవరి సిమ్ కార్డు సేవలనైనా పూర్తిగా నిలిపివేస్తే.. ఆ నంబర్ 90 రోజుల వ్యవధి తర్వాతే మరొక వ్యక్తికి ఇవ్వగలరు. కొత్త రూల్స్‌కు లోబడి ఉండేందుకు సిమ్ విక్రయదారులు.. నవంబర్ 30 లోపు నమోదు చేసుకోవాలి. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.

బల్క్ సిమ్ కార్డుల దుర్వినియోగం గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) గతంలో మాట్లాడుతూ... “ఇంతకుముందు, ప్రజలు మొబైల్ కొనుగోలు చేసి ఎక్కువ సిమ్ కార్డుల్ని కొనుగోలు చేసేవారు. కారణం సిమ్ కార్డుల కొనుగోలుపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడమే. అయితే ఈ నిబంధనకు స్వస్తి పలకాలని నిర్ణయించాం. బదులుగా మోసపూరిత కాల్‌లను ఆపడంలో సహాయపడే సరైన వ్యాపార కనెక్షన్ నిబంధనను తీసుకువస్తాం" అని అన్నారు.

Updated Date - 2023-12-01T14:06:10+05:30 IST