Walkway: నూతన స్పోర్ట్స్ కలెక్షన్‌ను విడుదల చేసిన మెట్రో బ్రాండ్స్ వాక్‌వే
ABN , First Publish Date - 2023-04-20T21:50:43+05:30 IST
స్టైల్, సౌకర్యం కలబోతతో వాక్‌వే (Walkway) షూస్ తాజా స్పోర్ట్స్ కలెక్సన్‌ను విడుదల చేసింది. స్త్రీ

న్యూఢిల్లీ: స్టైల్, సౌకర్యం కలబోతతో వాక్‌వే (Walkway) షూస్ తాజా స్పోర్ట్స్ కలెక్సన్‌ను విడుదల చేసింది. స్త్రీ పురుషుల కోసం విడుదల చేసిన ఈ కలెక్షన్ ప్రతి ఒక్కరికీ కచ్చితమైన శ్రేణి ఫుట్‌వేర్‌ను అందిస్తుంది. మరీ ముఖ్యంగా ఫిట్‌నెస్ కోసం తొలి అడుగు వేయాలనుకునే వారికి ఇవి పూర్తి సౌకర్యంగా ఉంటాయి.
తరచూ ప్రయాణాల్లో ఉండడంతోపాటు చురుకైన జీవనశైలిని కోరుకునే వారికి ఈ నూతన కలెక్షన్ అనువుగా ఉండనున్నాయి. యువతను దృష్టిలో పెట్టుకుని వీటిని డిజైన్ చేశారు. ఈ సందర్భంగా వాక్‌వే మెట్రోబ్రాండ్స్ లిమిటెడ్ బిజినెస్ హెడ్ మనోజ్ సింగ్ మాట్లాడుతూ.. తమ వినియోగదారులకు ఫిట్‌నెస్ ప్రయాణ ప్రారంభ వేళ వీలైనంత ఉత్తమ ఫుట్‌వేర్‌ను అందించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఇవి ఎవరికైనా కచ్చితమైన షూస్‌గా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ ఫుట్‌వేర్‌లో ప్రతి జత తేలిగ్గా, సౌకర్యంగా ఉండడంతోపాటు నాణ్యత కలిగిన మెటీరియల్‌ను ఉపయోగించారు. వీటలో బ్రీతబల్ మెష్ ఉండటం వల్ల సౌకర్యంగా ఉంటాయి. ప్రకాశవంతమైన రంగులు, శైలిలో లభ్యమయ్యే ఈ శ్రేణి పెర్ఫార్మెన్స్‌తోపాటు శైలి కోరుకునే వినియోగదారులకు ఇవి కచ్చితంగా మంచి ఆప్షన్ అవుతాయి. వీటిని ఆన్‌లైన్ ద్వారా కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం www.walkwayshoes.comను సందర్శించాలి.