జీఎంఆర్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌కు రూ.5,123 కోట్ల కాంట్రాక్టు
ABN , First Publish Date - 2023-09-04T02:06:52+05:30 IST
జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ అనుబంధ విభాగమైన జీఎంఆర్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్...
హైదరాబాద్: జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ అనుబంధ విభాగమైన జీఎంఆర్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్(జీఎ్‌సఈడీపీఎల్)కు ఉత్తర ప్రదేశ్ నుంచి రూ.5,123.37 కోట్ల ఆర్డర్ లభించింది. వారణాసి, అజాంఘర్, ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్ సహా యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంలో స్మార్ట్ మీటర్ల ఇన్‌స్టాలేషన్, ఇంటిగ్రేషన్‌తోపాటు 50.17 లక్షల స్మార్ట్‌మీటర్ల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టు ఇది అని కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్‌ఓఏ) అందుకున్నట్లు కంపెనీ ఆదివారం వెల్లడించింది.