Excell Broadband: 60 ఎంబీపీఎస్‌తో ఆకర్షణీయమైన ప్లాన్.. హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్!
ABN , First Publish Date - 2023-01-29T20:37:58+05:30 IST
రీజినల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ (Excell Broadband) ఆకర్షణీయమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ప్రకటించింది
హైదరాబాద్: రీజినల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ (Excell Broadband) ఆకర్షణీయమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ప్రకటించింది. హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్(Andhrapradesh), తెలంగాణ(Telangana)లోని టైర్-2, టైర్-3 నగరాల్లోనూ సేవలు అందిస్తోంది. ఈ రంగంలో 24 ఏళ్లు పూర్తిచేసుకున్న ఎక్సెల్.. హైదరాబాద్ వాసులకు ఆకర్షణీయమైన ధరతో 60 ఎంబీపీఎస్ అపరిమిత ప్లాన్‌ను ప్రకటించింది.
ప్లాన్లు ఇలా..
రూ.499 నెలవారీ రెంటల్‌తో 60 ఎంబీపీఎస్ అపరిమిత ప్లాన్‌ను ఎక్సెల్ తాజాగా ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 800 జీబీ (డౌన్‌లోడ్+అప్‌లోడ్) పరిమితి ఉంటుంది. ఆ తర్వాతి నుంచి 1 ఎంబీపీఎస్‌తో అపరిమిత డేటా లభిస్తుంది. ఇందులో స్మార్ట్, ఎసెన్షియల్, అల్టిమేట్, ప్రిఫర్డ్.. అనే నాలుగు ప్లాన్లు ఉన్నాయి. వీటిలో వరుసగా 60 ఎంబీపీఎస్, 80 ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్, 150 ఎంబీపీఎస్ వేగం ఉంటుంది.
ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్ దీర్ఘకాలిక ప్లాన్ ప్రయోజనాలు
ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఒక నెల ఉచిత సర్వీసులు, లేదంటే వైఫై రౌటర్‌తోపాటు అదనంగా 100 జీబీ నెలవారీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఏడాది సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే రెండు నెలల ఉచిత సర్వీసులతోపాటు అదనంగా నెలకు 100 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ ఈ ప్లాన్లు వర్తిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఏయే పట్టణాల్లో..
ఆంధ్రప్రదేశ్‌లో ఆకివీడు, అనకాపల్లె, భీమవరం, చంద్రగిరి, చిలకలూరిపేట, చీరాల, దాచేపల్లె, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంటూరు, హనుమాన్ జంక్షన్, జగ్గయ్యపేట, కాకినాడ, కంకిపాడు, కావలి, కోదాడ, కొండపల్లి, మచిలీపట్నం, మదనపల్లె, మండపేట, మంగళగిరి, నరసరావుపేట, నర్సాపురం, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పాలకొల్లు, పార్వతీపురం, పిడుగురాళ్ల, రాజమండ్రి, రామచంద్రాపురం, రావులపాలెం, సామర్లకోట, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, తిరువూరు, తుని, విజయవాడ, వినుకొండ, విశాఖపట్టణం, విజయనగరం, ఉయ్యూరు, ఇతర పట్టణాల్లో ఎక్సెల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
ఇక, తెలంగాణలో ఖమ్మం, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్లాన్లు అన్ని చోట్లా ఒకేలా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 49 ప్రాంతాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి.