Layoffs : డిస్నీలో వచ్చే వారం మరో విడత ఉద్యోగాల కోత

ABN , First Publish Date - 2023-04-19T07:28:40+05:30 IST

వాల్ట్ డిస్నీ కో వచ్చే వారం సంచలన నిర్ణయం తీసుకోనుంది....

Layoffs : డిస్నీలో వచ్చే వారం మరో విడత ఉద్యోగాల కోత
Disney plans Big round Job cuts

వాషింగ్టన్: వాల్ట్ డిస్నీ కో వచ్చే వారం సంచలన నిర్ణయం తీసుకోనుంది.(Disney plans) వచ్చే వారం(next week) మరో విడత ఉద్యోగాల కోతలు విధించాలని డిస్నీ నిర్ణయించింది. డిస్నీ వినోద విభాగంలో 15 శాతం సిబ్బందితో సహా వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని(Layoffs) యోచిస్తున్నట్లు సమాచారం.ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మొదటి విడతగా 7వేలమంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించింది.

ఉద్యోగాల కోతల్లో టీవీ, ఫిలిం, థీమ్ పార్కులు, కార్పొరేట్ విభాగాల్లో లేఆఫ్ లు(Big round of job cuts) ఉంటాయని డిస్నీ ప్రకటించింది. ఉద్యోగాల నుంచి తొలగించే వారికి ఈ నెల 24వతేదీనాటికి సమాచారం అందజేస్తామని డిస్నీ తెలిపింది. వార్షిక ఖర్చులను తగ్గించుకునేందుకు డిస్నీ ఉద్యోగాల కోత విధించనుంది.డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సహా టీవీ, స్ట్రీమింగ్ విభాగాల్లో ఉద్యోగాల కోతలు ఉంటాయని డిస్నీ వివరించింది.

Updated Date - 2023-04-19T07:32:39+05:30 IST