Crystal Crop: వరి రైతుల కోసం ‘మెంటార్’ను విడుదల చేసిన క్రిస్టల్ క్రాప్
ABN , First Publish Date - 2023-01-07T18:59:27+05:30 IST
ప్రముఖ ఆగ్రోకెమికల్ కంపెనీ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ (Crystal Crop Protection) వరి రైతుల కోసం నూతన ఫంగిసైడ్ ‘మెంటార్’(Mentor)ను
హైదరాబాద్: ప్రముఖ ఆగ్రోకెమికల్ కంపెనీ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ (Crystal Crop Protection) వరి రైతుల కోసం నూతన ఫంగిసైడ్ ‘మెంటార్’(Mentor)ను విడుదల చేసింది. ఇది వరిలో కనిపించే ఆకుమడత(Sheath Blight) వంటి తెగుళ్లను నియంత్రించడంతోపాటు పంటకు అదనపు రక్షణ కల్పించి అధిక దిగుబడిని అందించడంలో విశేషంగా సాయం చేస్తుంది. మెంటార్‌ను ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని వ్యవసాయ యూనివర్సిటీల్లో పరీక్షించారు. వరిలో కనిపించే తెగుళ్ల నియంత్రణకు ఇది తోడ్పడుతుందని తేలింది.
దేశ ఆహార భద్రత పరంగా అతి ముఖ్యమైన వరిపంట రక్షణ కోసం అత్యంత శక్తివంతమైన ఫంగిసైడ్(Fungicide ) ‘మెంటార్’ను విడుదల చేసినందుకు ఆనందంగా ఉందని క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ మార్కెటింగ్) సీఎస్ శుక్లా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమబెంగాల్, పంజాబ్, హర్యానా లాంటి వరి ఎక్కువగా పండించే రైతులకు ఇది ప్రయోజనకారి కానుంది. రబీ సీజన్ నుంచి మెంటార్ రైతులకు అందుబాటులో ఉంటుంది. వరిపై ఆధారపడిన రైతులకు ఇది మరింత లాభదాయకంగా మారుతుందని క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ నేషనల్ సేల్స్ హెడ్ అజిత్ శంక్‌ధర్ అన్నారు.