Hysea Award 2023: ప్రతిష్ఠాత్మక హైసియా అవార్డు అందుకున్న అన్వయా కిన్ కేర్
ABN , First Publish Date - 2023-02-14T21:46:23+05:30 IST
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఐఓటీ ఆధారిత వన్ స్టాన్ సీనియర్
హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఐఓటీ ఆధారిత వన్ స్టాన్ సీనియర్ కేర్ ప్లాట్‌ఫామ్ అన్వయా కిన్ కేర్.. ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (Hysea) అవార్డును అందుకుంది. ఇంటి వద్దనే డెమిన్షియా కేర్, ఐఓటీ ఆధారిత ప్రోయాక్టివ్ స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సొల్యూషన్స్ కోసం బెస్ట్ ప్రొడక్ట్- ఎస్లాబ్లిష్డ్ కేటగిరీలో ఈ అవార్డు అందజేశారు.
అవార్డుల వేడుకలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ దేబాశిష్ ఛటర్జీ, సైయెంట్ ఫౌండర్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, హైసియా మేనేజ్‌మెంట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్వయాకిన్ కేర్ ఫౌండర్, డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిష్ఠాత్మక హైసియా అవార్డు అందుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇది తమ నిబద్ధత, మౌలిక విలువలకు ప్రతిరూపంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది తమ ప్రొఫెషనల్ బృందానికంతటికీ గర్వకారణమన్నారు. వారి సహకారం లేకుండా ఈ అవార్డు సాధ్యం కాదని పేర్కొన్నారు. అన్వయా డెమిన్షియా కేర్ ప్లాన్‌ను డెమిన్షియాతో బాధపడుతున్న వ్యక్తులు (PWD) కోసం రూపొందించినట్టు వివరించారు.