Axis Bank: ఏపీలో ఉచిత ఆరోగ్య శిబిరాలు

ABN , First Publish Date - 2023-04-27T19:58:43+05:30 IST

దేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ ఏపీలో ఉచిత

Axis Bank: ఏపీలో ఉచిత ఆరోగ్య శిబిరాలు

విజయవాడ: దేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ ఏపీలో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంలలో ఎంపిక చేసిన యాక్సిస్‌ బ్యాంక్‌ కేంద్రాల వద్ద ఈ శిబిరాలను నిర్వహిస్తోంది.

ఇందుకోసం ప్రముఖ డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, అపోలో, కేర్‌, మ్యాక్సివిజన్‌, శంకర్‌ నేత్రాలయ వంటి ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కేంద్రాలలో ఆయా ఆసుపత్రుల వైద్యుల సేవలు పొందొచ్చు. అలాగే, నిపుణులైన వైద్యుల నుంచి సలహాలు, సూచనలు లభిస్తాయి. ఈ కేంద్రాలలో ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు డాక్టర్ల కన్సల్టేషన్‌ కూడా పూర్తి ఉచితం. కంటి పరీక్షలు, రక్తపోటు (BP), ర్యాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ (RBC), ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG) వంటి పరీక్షలు ఈ కేంద్రాల్లో చేస్తారు.

ఈ నెల 26న కాకినాడ డివిజన్‌లోని తాడేపల్లిగూడెం శాఖ, రాజమండ్రి డివిజన్‌లోని ఏలూరులో శాఖల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలను యాక్సిక్ బ్యాంక్ నిర్వహించింది. మే 3న రాజమండ్రి డివిజన్‌లో ఏలూరు వన్‌, విజయవాడ డివిజన్‌లో చిల్లకల్లు, మే 4న విజయవాడ డివిజన్‌లోని తెనాలి శాఖ, మే 05న విజయవాడ డివిజన్‌లోని మచిలీపట్నం, విజయవాడ వ్యూహాత్మక శాఖలు, మే 6న విజయవాడ డివిజన్‌లోని గుణదల, నూజివీడు, విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్‌ శాఖల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. కాగా, ఈ ఆరోగ్య శిబిరాల్లో రోజుకు 200 మందికిపైగా ఖాతాదారులు ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - 2023-04-27T19:58:43+05:30 IST